16-02-2026 12:00:00 AM
చైర్మన్ కోసం ముగ్గురు ఆరాటం
పీఠం దక్కేది ఎవరికో
సీల్డ్ కవర్‌లో చైర్మన్, వైస్ చైర్మన్‌ల పేర్లు
ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం అయింది. మున్సిపల్ పీఠాన్ని ఎవరు అదిరోయిస్తారో నన్న ఉత్కంఠ నెలకొంది. ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయగా పదిమంది కాంగ్రెస్ కౌన్సిలర్ లు గెలిచారు. రెండు స్థానాలు ఒకటి టిఆర్‌ఎస్, స్వతంత్ర అభ్యర్థి ఒకటి గేలుపొందడంతో, పూర్తి అవకాశాలు మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీకే దక్కనుంది. మున్సిపల్ చైర్మన్ పీఠం కొరకు గెలుపొందిన 10 కౌన్సిలర్ లలో ఇద్దరు చైర్మన్ పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆశీర్వాదం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఏడవ వార్డ్ కౌన్సిలర్ భాగ్యవతి వైపే పలువురి కౌన్సిలర్ల మొగ్గు
మొదటిసారి ఏడవ వార్డు నుండి పోటీ చేసిన మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మత్తమాల భాగ్యవతి అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు కృషి చేస్తున్నారు. భాగ్యవతి కుమారుడు ప్రాథమిక సహకార సంఘం ఎల్లారెడ్డి మాజీ ఉపాధ్యక్షుడు మతమాల ప్రశాంత్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు. తన తల్లికి మున్సిపల్ చైర్మన్ పదవి అందించాలని పలువురు కౌన్సిలర్ల మద్దతు తమకే ఉందని ప్రశాంత్ గౌడ్ చెప్తున్నారు.
మరోసారి చైర్మన్ పదవి ని ఆశిస్తున్న పద్మ శ్రీకాంత్
ఎల్లారెడ్డి మునిసిపల్ చైర్మన్ గా కొన్ని మాసాలపాటు కొనసాగిన పద్మ శ్రీకాంత్ పదో వార్డు కౌన్సిలర్ గా గెలిచారు.గతంలో కొద్ది నెలలు పాటు మున్సిపల్ చైర్మన్ గా పనిచేశానని ఈసారి మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
స్వతంత్ర అభ్యర్థి గా గెలిచి చైర్మన్ పీఠం కొరకు సమరం
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్ కోసం ఎప్పుడు లేని విధంగా పలువురు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన సిద్ధి శ్రీధర్ చైర్మన్ కోసం ఆశిస్తున్నారు. పలువురు కౌన్సిలర్లు మద్దతు స్వతంత్ర అభ్యర్థి సిద్ధి శ్రీధర్ వైపు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ చైర్మన్ పదవి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వ్యక్తికి చైర్మన్ పదవి దక్కుతుందా వేచి చూడాలి.
చైర్మన్ పదవి ఎమ్మెల్యే చేతుల్లోనే
పార్టీకి ప్రత్యక్షంగా కృషిచేసిన వారికి పదవి దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు పేర్కొంటున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ చేతుల్లో మున్సిపల్ చైర్మన్ పదవి ఉన్నట్లు ఆయన ఎవరి పేరును సూచిస్తే వారికే అధిష్టానం సీల్ కవర్లో పేరు వస్తుందని వారికే చైర్మన్ పీఠం దక్కుతుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. మున్సిపల్ పీఠంపై మరికొన్ని గంటల్లోనే ఎవరు కూర్చోబోతున్నారు అన్న ఉత్కంఠ నెలకొంది. ఎల్లారెడ్డి మున్సిపల్ పీఠం ముగ్గురు ఆశిస్తున్నారు. వారిలో ఎవరికి మున్సిపల్ పీఠం దక్కనుందో వేచి చూడాల్సిందే.