calender_icon.png 7 November, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతి అదృశ్యం

07-11-2025 12:46:45 AM

జహీరాబాద్, నవంబరు 6 : జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రామ్ నగర్ లో ఓ యువతి అదృశ్యమైనట్లు జహీరాబాద్ టౌన్ ఎస్‌ఐ వినయ్ కుమార్ తెలిపారు. రామ్ నగర్ లో నివాసం ఉంటున్నజిలానుద్దిన్ భార్య మహాబీష్ (19) ఇంటి నుండి పారిపోయినట్లు ఆయన తెలిపారు. ఈనెల 5న మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయిందని, ఆమె ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో ఆమె భర్త జిలానుద్దిన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

యువకుడి అదృశ్యం

జహీరాబాద్, నవంబరు 6 :జహీరాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని మేస్త్రి కాలంలో నివాసం ఉంటున్న బర్దిపూర్ దిలీప్ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు జహీరాబాద్ పట్టణ ఎస్త్స్ర వినయ్ కుమార్ తెలిపారు. ఈ నెల 3న దిలీప్ మేస్త్రి కాలంలో కిరాయికి ఉంటున్న ఇంటి నుంచి వెళ్లినట్లు తెలిపా రు.

దిలీప్ భార్య ఎస్తర్ రాణి బంధువుల వద్ద ఆచూకీ కోసం వెతికినా సమాచారం అందకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు జహీరాబాద్ టౌన్ ఎస్‌ఐ వినయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.