07-11-2025 12:44:43 AM
నారాయణఖేడ్, నవంబర్ 6: కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా హళ్లిఖేడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జగన్నాథ్ పూర్ గ్రా మానికి చెందిన మృతుల కుటుంబాలను నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి.సంజీవరెడ్డి గురువారం పరామర్శించారు.
ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్ర మాదం సంఘటన తమను తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కు టుంబాలకు ప్రభుత్వపరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చారు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న రిపోర్టర్ ప్రతాప్ కు అవసరమైన సహాయం అందజేస్తామని పేర్కొన్నా రు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకు లు, గ్రామస్తులు ఉన్నారు.