హుండీలోని నగదు చోరీ
06-10-2024 12:04 AM
భీమదేవరపల్లి, అక్టోబర్ 5: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామ ంలోని సాయిబాబా ఆలయంలోని హుండీలోని నగదు చోరీ అయింది. ఆలయ రెండు తాళాలు పగులగొట్టిన దుండగులు హుండీని పగులగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లారు. ఆలయంలో సీసీ కెమెరాలో 15 సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలు దొంగతనానికి పాల్పడినట్లు రికార్డు అయింది. శనివారం క్రైం బ్రాంచ్ ఫోరెన్సిక్ అధికారులు వేలిముద్రాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.




