మల్లన్న... అభివృద్ధి జాడ ఏదన్నా?
- పనులు పూర్తయిన ప్రారంభించని వైనం
- ప్రతిపాదనలోనే 100 గదుల సత్రం
- పురోగతిపై సమీక్షించని దేవాదాయ శాఖ
కొమురవెల్లి, జూన్ 29: రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతున్న కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంపై ప్రజా ప్రతినిధుల, దేవాదాయ శాఖ పర్యవేక్షణ కొరవడడంతో అభివృద్ధి ప నులు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. ఆల య అభివృద్ధిని పట్టించుకునే నాధుడే కరువయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు. మూ డు నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాల సం దర్భంగా మంత్రుల సమీక్షలు, అధికారులుహడావిడి చేసి తాత్కాలికంగ అవసరమయ్యే సౌకర్యాలు కల్పించి చేతులు దులుపుకుంటున్నారు.
శాశ్వత ప్రాతిపాదికన చేపట్టే పనుల పై శ్రద్ధ వహించరని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయ మార్గాల మీద ఉన్న శ్రûద్ధ, సదుపాయాలు కల్పించడంలో శాఖ అధికారులకు లేదని భక్తులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రతి ఏటా జాతర సమయంలో దేవాదాయ శాఖ మంత్రి కొం డ సురేఖ, జిల్లాకు మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభా కర్ స్వామి వారిని దర్శనం చేసుకుని మొ క్కులు తీర్చుకుంటారు.
వారు కూడా ఆల య అభివృద్ధిపై ఆసక్తి చూపకపోవడం గమనహర్హం. గత మూడేళ్ల నుంచి రెగ్యులర్ పాలకమండలి నియమించకపోవడం, తా త్కాలిక పాలకమండలి నియమించి, జాతర నిర్వహణకు కావలసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శాశ్వత పనులపై దృష్టి సారించ డం లేదు. అదియేగాక ఇన్చార్జి కార్యనిర్వాహ ణ అధికారులతో పరిపాలన కొనసాగిస్తున్నారు. దాంతో అనేక ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయి.
గత మూడు సంవత్సరాల నుండి ఆలయ అభివృద్ధి పనుల కోసం ఎటువంటి నిధులు కేటాయించకపోవడం చూస్తుంటే ఈ ఆలయం పై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్న అనుమానం భక్తుల్లో కలుగుతోంది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన మాస్టర్ ప్లాన్ లో సైతం మల్లన్న ఆ లయాన్ని చేర్చకపోవడం దీనికి మరింత బలాన్ని చేకూర్స్తుంది. రెండు సంవత్సరాల నుండి 20 కోట్ల వార్షిక ఆదాయం ఈ ఆ లయం ఆర్జిస్తుంది. ఆదాయ ఆర్జనలో రాష్ట్రంలోనే నాలుగో స్థానం ఆక్రమించింది.
ఇంత గా ఆదాయం వస్తున్నప్పటికీ భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడంలో దేవాదాయ శాఖ విఫలమవుతుందని భక్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా మల్లన్న దర్శనానికి 25 లక్షలు నుంచి 30 లక్షలు వరకు భక్తులు వస్తుంటారు. వీరికి సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా తాగునీటి సమ స్య, మరుగుదొడ్లు, వసతి గృహాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
పనులు పూర్తి... ప్రారంభం ఎప్పుడో
భక్తుల కోసం ఏర్పాటుచేసిన క్యూ కాంప్లెక్స్ దాదాపు పూర్తయినప్పటికీ భక్తులకు అందుబాటులోకి తేవడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. 12 కోట్ల నిధులతో మూడేళ్ల క్రితం నిర్మాణం పనులు చేపట్టి పూర్తి చేసినప్పటికీ ఎందుకు ప్రారంభించడం లేదు అర్థం కాని పరిస్థితి. రద్దీ సమయాల్లో భక్తులు ఎండలోనే దర్శనానికి నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.
అదేవిధంగా దాచారం గుట్టపై రూ.10.95 కోట్లతో50 గదుల భవన నిర్మాణానికి 2019 పనులు ప్రారంభమై ఏడేళ్లుగా పనులు కొనసాగాయి.గత బ్రహ్మోత్సవాల ముందు భవన నిర్మాణ పనులు పూర్తికాగా, విద్యుత్, పంబ్లింగ్ పెండింగ్ లో ఉన్నాయని దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించినప్పటికీ, ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేదు. వెంటనే భవనాలను ప్రారంభించి అందుబాటులోకి తేవాలని భక్తులు కోరుతున్నారు.
ప్రతిపాదిక పనులకు మోక్షం ఎప్పుడు
దాతల సహకారంతో అన్నదాన సత్రం పక్కనగల స్థలంలో వంద గదుల కాటేజ్ నిర్మాణం ప్రతిపాదనలోనే మగ్గుతుంది.ప్రతిపాదనలు పంపి రెండు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ ఆమోదం లభించలేదు. 12 కోట్లతో నిర్మించే కాటేజీల నిర్మాణానికి దాతల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు ఇప్పటికే కాటేజీల నిర్మాణానికి 13మంది భక్తులు 15 లక్షలు చొప్పున విరాళాలు అందజేశారు. పనులు ప్రారంభిస్తే మరి కొంతమంది ముందుకొచ్చే అవకాశం ఉంది.
దేవాలయంలోని సుతిమాను గుండు వద్ద రూ.63 లక్షలతో నిర్మిస్తున్న డమరుకం, త్రిశూలం పనులు నిధులు సరిపోక, అంచనా వ్య యం రూ. 80 లక్షల రూపాయలకు పెంపు ప్రతిపాదన, అమ్మ వార్ల స్వర్ణ కిరిటాల తయారీకీ అనుమతి, భక్తుల అన్న ప్రసాదాల పెంపు ప్రతిపాదన పరిపాలన అనుమతుల వేచి చూడాల్సిన పరిస్థితి. ఇలా చాలా ఫైళ్ళు కమిషనర్ కార్యాలయంలో పెండింగ్లో ఉన్నాయి.
ఆలయ అభివృద్ధి దైవాధీనమేన
ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి మల్లికార్జున స్వామియే చూసుకునే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలైన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, ఆంజనేయస్వామి దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేసి, శరవేగంగా అభివృద్ధి చెందుతుండగా, ఈ ఆలయం పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఆలయాల మాస్టర్ ప్లాన్లు జాబితాలో ఈ ఆలయం లేకపోవడం భక్తులను నిరాశపరిచింది.
స్థానిక ఎమ్మెల్యేగాని, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి గాని మాస్టర్ ప్లాన్ లో చేర్చడానికి ఎటువంటి ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకోకపోవడం పట్ల స్థానికులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రెగ్యులర్ కార్యనిర్వాహణ అధికారిని నియమించి, పాలకమండలి ఏర్పాటుచేసి, నిలిచిపోయిన పనులు పై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని భక్తులు కోరుతున్నారు.






