30 June, 2026 | 1:38 AM

భగ్గు మంటున్న బ్రాహ్మణ సమాజం

30-06-2026 12:59 AM
  1. బీహార్‌లో భరత్ భూషణ్ తీవారీ ఎన్‌కౌంటర్‌పై నిరసన జ్వాల 
  2. ఉత్తరాదిన ఉధృతంగా ఆందోళనలు 
  3. పోలీసుల తీరుపై అనుమానాలు
  4. నిరాయుధుడైన సామాజిక కార్యకర్తపై కాల్పులు?
  5. ఎన్‌కౌంటర్‌కు ముందు తివారీ ఫేస్‌బుక్ లైవ్ వీడియోలో బట్టబయలు
  6. సీఎం సామ్రాట్ ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకమవుతున్న విపక్షాలు

బీహార్ పోలీసుల చేతిలో సామాజిక కార్యకర్త భరత్ భూషణ్ తివారీ దారుణ హత్యకు గురికావడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహమవుతున్నది. ముఖ్యంగా ఉత్తరాదిన (హిందీ బెల్ట్)లో బ్రాహ్మణ సమాజం ఎన్‌కౌంటర్‌పై భగ్గుమంటున్నది. మధ్య బీహార్ లోని భోజ్పూర్ జిల్లా బిలౌతీలో ఈనెల 17న 28 ఏళ్ల భరత్ భూషణ్ తివారీ పోలీసుల ఎన్‌క్కౌంటర్‌లో మరణించాడు. సోషల్ మీ డియాలో భారీగా ఫాలోవర్లు ఉన్న తివారీ, తన చివరి క్షణాలను ఫేస్‌బుక్‌లో లైవ్-స్ట్రీమ్ చేయడంతో ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

కుల సమీకరణాలు రాజకీయాలను శాసించే ఆ రాష్ట్రంలో ఒక బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన సోషల్ వర్కర్ ఎన్‌కౌంటర్ కావడం కలకలం రేపింది. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన తివారీ కొన్నేళ్ల నుంచి సామాజి క రుగ్మతలపై ఉద్యమిస్తున్నాడు. రాష్ట్ర ప్రజ ల ఆదరాభిమానాలు చూరగొన్నాడు. ము ఖ్యంగా నదీ తీరాల కోత, వరదలు, పేదల నిర్వాసిత సమస్యలపై తివారీ అనేక వేదికలపై గళం విప్పాడు. ఆయనపై అంతకు ముందు ఎలాంటి నేర చరిత్ర లేదు.

అయి తే.. తివారీ మానసిక స్థితి సరిగ్గా లేదని, చట్టవిరుద్ధంగా ఆయుధాలు కలిగి ఉన్నాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తివారీ తమపైకి పోలీసులపైకి కాల్పులు జరిపాడని, దీంతో తాము గత్యంతరం లేక ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపామని చెబుతున్నారు. కాల్పుల్లో తివారీ మృతిచెందాడని వెల్లడిస్తున్నారు. కానీ, తివారీ లొంగిపోయి ఆయుధాన్ని కిందపడేసిన తర్వాతే పోలీసులు కాల్పులు జరిపారని గ్రామస్థులు, కు టుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనికి బ లాన్ని చేకూరుస్తూ ఆయన తుపాకీని కిందపడేసి పోలీసులను వేడుకుంటున్న దృశ్యా లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

దేశవ్యాప్తంగా ప్రకంపనలు

తివారీ ఎన్‌కౌంటర్ ఘటన భోజ్పూర్ జి ల్లావాసులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తివారీ మృతదేహంతో గ్రామస్తులు మరుసటి రోజు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. బిలౌతీ గ్రామంలో జరిగిన ఈ రాస్తారోకోలో బ్రాహ్మణ మహాసభ, పరశురామ్ మహాసభ, కర్ణి సేన వంటి వివిధ సామాజిక వర్గాల సంఘాలు హాజరయ్యా యి. తివారీ మృతికి కారణమైన వారిపై చర్య లు తీసుకోవాలని ప్రభుత్వానికి 15 రోజుల గడువు విధించాయి.

మొత్తానికి ఎన్‌కౌంటర్ ఘటన బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లోని బ్రా హ్మణ సామాజిక వర్గాల్లో ఆందోళన రగిల్చింది. వెనుకబడిన వర్గాల కోసం గొంతు కగా నిలిచిన ఓ బ్రాహ్మణ యువకుడిని చంపేశారంటూ బ్రాహ్మణ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఎన్‌కౌంటర్‌పై ఉన్నత స్థా యి జ్యుడీషియల్ విచారణ జరిపించాలని, బాధ్యులైన పోలీసులపై హత్య కేసులు నమో దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

వ్యవస్థాగత వైఫల్యాలే కారణమా?

ప్రజలకు న్యాయం సకాలంలో, వేగంగా అందనప్పుడు భరత్ తివారీ లాంటి వారు హీరోలుగా అవతరిస్తారు. రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతర పాలకులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించనప్పుడు ప్రజలకు ఇతర మార్గం కనిపించదు. పరిపాలన, న్యాయ వ్యవస్థలు విఫలమైనప్పుడు తమ తరఫున నిలబడి న్యాయం చేసే శక్తులను వారు ఆశ్రయిస్తారు. అలా ప్రజల పక్షాన నిలిచేవారే నిజమైన హీరోలుగా మారుతారు.

నిజానికి దేశంలో నక్సలిజం పుట్టడానికీ ఇలాంటి కారణాలే మూలం. ఇతర దేశాల్లోని యువత కూడా వ్యవస్థలను మార్చడానికి ఇలాగే ఉద్యమించారు. యూపీ వంటి రాష్ట్రాల్లో ప్రశం సలు అందుకుంటున్న ఎన్కౌంటర్ సంస్కృ తి ఇప్పుడు తమ మద్దతుదారుడినే బలితీసుకోవడంపై బ్రాహ్మణ వర్గాల్లో అంతర్మథనం మొదలైంది. ఈ వివాదం బీహార్లోని ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలకు ఒక బలమైన అస్త్రంగా మారింది.

బీజేపీ మినహా దాదాపు అన్ని ప్రధాన పార్టీలు తి వారీని అమరవీరుడిగా పేర్కొంటూ ఆయన కుటుంబానికి మద్దతుగా నిలిచాయి. ఆర్జేడీ మిత్రపక్షాలు పోలీసుల కథనాన్ని తప్పుబడుతూ, ఇది ప్రభుత్వ స్పాన్సర్డ్ హత్య అని ఆ రోపించాయి. సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశాయి.

జన్ సూరజ్ అధినేత ప్రశాంత్ కిశోర్ ఘటనపై ప్రభుత్వాన్ని విమర్శించారు. కాల్పులు జరపమనే ఆదేశాలు పాట్నా నుంచే వచ్చా యా అని ఆయన ప్రశ్నించారు. తుపాకీ పట్టిన వారితోపాటు ఆర్డర్ ఇచ్చిన వారిని కూడా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు మానవ హక్కుల ఉల్లంఘనలను ఎండగడుతూ నిరసనల్లో చేరాయి.

ప్రభుత్వ చర్యలు ముగింపు

జేడీయూ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్య ప్రకాష్ మిశ్రా సైతం సామాజిక మాధ్యమాల్లోని వీడియో లు అనుమానాలను రేకెత్తిస్తున్నాయని అంగీకరించారు. జ్యుడీషియల్ విచారణకు, దోషులైన పోలీసులపై చర్యలకు ఆయన మొగ్గు చూపారు. ఈ కేసుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు కావడం తో జూన్ 20న బీహార్ సీఎం సామ్రా ట్ చౌదరి తాజాగా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తితో జ్యుడీషియల్ విచారణకు ఆదేశించారు.

ఒక ఎస్డీపీవోపై హత్య కేసు నమోదు చేసి, మరికొంతమందిని సస్పెండ్ చేశారు. అయినప్ప టికీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు నిరసనకారులను శాంతింపజేయలేదు. బాధ్యులకు ఉరిశిక్ష పడాలని తివారీ తల్లి డిమాండ్ చేస్తుండగా, అంతా చూస్తుండగానే తన కొడుకును ఎలా చంపేస్తారని తండ్రి ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణ న్యాయం చేకూరుస్తుందా లే దా అనేది రాబోయే ఎన్నికల్లో బీహార్ రాజకీయాల దిశను నిర్దేశించనుంది.