30 March, 2026 | 5:14 PM

పార్క్‌చేసి ఉన్న బైక్‌ల చోరీ

06-11-2024 02:37 AM

శేరిలింగంపల్లి, నవంబర్ 5: ఇంటిముందు పార్క్ చేసి ఉంచిన బైక్‌లు చోరీకి గురైన ఘటన శేరిలింపల్లి డివిజన్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పరిగి నియోజకవ్గం రంగాపూర్‌కి చెందిన రమాకాంత్ (30) శేరిలింగంపల్లిలోని సుదర్శన్‌నగర్‌లో నివాసం ఉంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చదువును కొనసాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే కార్యక్రమాలు పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటిముందు రెండు బైక్‌లను పార్క్ చేశాడు.

మంగళవారం తెల్లవారుజామున ఇద్దరు గుర్తుతెలియని దుండగులు తలకు హెల్మెట్ ధరించి సుదర్శన్‌నగర్ కాలనీలో రెండు బైక్‌లను చోరీ చేశారు. ఈ దృశ్యాలన్నీ కాలనీలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి బాధితుడు గచ్చిబౌలి పీఎస్‌ఓ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.