15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఎన్‌హెచ్‌–365 పక్కనే దొంగతనం.. భద్రత ప్రశ్నార్థకం!

06-02-2026 10:06 AM

చివ్వెంల: జాతీయ రహదారి ఎన్‌హెచ్‌–365కు అతి సమీపంలోనే దొంగలు రెచ్చిపోవడం చివ్వెంల మండలంలో భద్రతపై తీవ్ర సందేహాలు కలిగిస్తోంది. అక్కలదేవిగూడెం గ్రామ పరిధిలోని అమరగాని ఆంజనేయులు వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్‌లోని విలువైన పనిముట్లను గుర్తుతెలియని దొంగలు రాత్రి వేళ దొంగిలించారు. ఈ ఘటనలో రైతులకు అత్యంత అవసరమైన స్టార్టర్ పెట్టెలు, విద్యుత్ వైర్లు ఎత్తుకెళ్లడంతో సాగు పనులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. జాతీయ రహదారి పక్కనే ఈ తరహా దొంగతనాలు జరుగుతుండటం, వరుస ఘటనలపై చర్యలు లేకపోవడం రైతులు, గ్రామస్తుల్లో భయాందోళనను పెంచుతోంది. దొంగలు ఎవరో ఇప్పటికీ తేలకపోవడంతో, గ్రామంలో రాత్రి పహారా, పోలీస్ గస్తీ పెంచాలని, దొంగలను వెంటనే పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.