17 April, 2026 | 2:32 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

ఆన్లైన్ మిషన్ ప్రాబ్లంతో రైతుల గోస

06-02-2026 10:03 AM

అధికారులు పట్టించుకుంటలేదని రైతులఆగ్రహం.

తుంగతుర్తిలో యూరియా అధిక ధరలకు అమ్మకాలు.. పట్టించుకోని ఏడిఏ.

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూరియా కోసం ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టి, యూరియా బస్తాలు కొరత లేకుండా నివారించాలనే దృడ సంకల్పంతో, ఆన్లైన్ పద్ధతిని ప్రవేశపెట్టగా, ఆదిలోనే రైతులు కష్టాలు పడుతున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో గురువారం ఉదయం రైతు సేవా సహకార సొసైటీ తో పాటు పలు కేంద్రాలలో ఆన్లైన్ మిషన్లు ఒక్కసారిగా సర్వర్ బిజీ తో కొన్ని, మరి కొన్ని ఏకంగా మిషన్ నడవకపోవడంతో, కోదాడ ,హుజూర్నగర్ ప్రాంతాల నుండి ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న రైతులు,2 రోజులు కావడంతో, ఆన్లైన్ చేసింది పోగా, దుబారా ఖర్చులతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

సహకార సొసైటీలో ఆన్లైన్ మిషన్ నడవకపోవడంతో, ప్రత్యాన్ మాయం ఏమైనా ఉందని ఏడిఏ జెడిఎ లను విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ఆన్లైన్ విధానం పనిచేయనప్పుడు, కనీసం ఆఫ్లైన్ విధానంలో ప్రత్యామ్నాయంగా రైతులకు ఏమి చేయాలో, ప్రభుత్వం అధికారులకు మార్గ నిర్దేశాలు, ఇవ్వకపోవడంతో, మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు చందంగా రైతుల పరిస్థితి దాపురించింది. ఒక్కసారి ఆన్లైన్ పోతే మళ్ళీ తిరిగి ఆన్లైన్ చేసుకుంటే యూరియా బస్తాలు వస్తాయో రాదు అని రైతు నిరాశపడుతున్నాడు. దీనికి తోడు తుంగతుర్తి లోని కొన్ని ఫెర్టిలైజర్ షాపులలో అధిక ధరలకు యూరియా అమ్మకాలు జరుగుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల ప్రయోజనాల దృష్టి తక్షణమే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ఆన్లైన్ పనిచేయకపోతే సదర్ రైతుకు ఆఫ్లైన్లో యూరియా బస్తాలు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.