ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కనీస వసతులు లేవు
విద్యార్థి,యువజన సంఘాల నేతల ఆరోపణ
జూబ్లీహిల్స్, ఆగస్టు 4(విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కనీస వసతులు లేవని విద్యార్థి,యువజన సంఘాల నేతలు ఆరోపించారు. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆప్ ఇండియా (డీవైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. బోరబండ సైట్ 3 వద్ద నిర్వహించిన నిరసనలో విద్యార్థి నేతలు పలు డిమాండ్లను చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వెంటనే సొంత భవనాలు నిర్మించాల న్నారు. కళాశాలల అభివృద్ధికి నిధులను కేటాయించాలన్నారు.విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు.
నాణ్యమైన విద్యా బోధన కోసం ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చే యాలన్నారు. భవిష్యత్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలన్నారు.అధికారుల నిర్యక్ష్యం కారణంగా జూనియరల్ కళాశాలల పరిస్థితి నానాటికి దీనావస్థకు చేరుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సునీల్,ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్ రెడ్డి,కార్యదర్శి లెనిన్,నాయకులు ప్రవీణ్, మనోజ్,జగ్గు,చందు,సాయి, కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






