07-02-2026 12:00:00 AM
మంచిర్యాల జిల్లాలో మద్యంప్రియుల ఇబ్బందులు
మంచిర్యాల, ఫిబ్రవరి ౬ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్‌తో పాటు బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీల ఎన్నికల ప్రచారాలు పోటాపోటీగా సాగుతున్నా యి. ప్రధాన పార్టీల అభ్యర్థులకు తామేమి తక్కువ కాదన్నట్టు ఇతర పార్టీల, ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ఇదే క్రమంలో మద్యం అంతకు రెట్టింపు స్థాయిలో పంపకాలు జరుపుతున్నారు.
ప్రచారంలో పాల్గొన్న వారంద రికి భోజన సౌకర్యంతో పాటు మహిళలకు చల్లని పానియాలు, సాయంత్రం పురుషులతో సమావేశాలు పెట్టి మద్యం పంపకాలు జరుపుతున్నారు. జిల్లాలో 73 మద్యం దుకాణాలుండగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధి లో 23 దుకాణాలు, చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో ఏడు, లక్షెట్టిపేటలో ఎనిమిది, క్యాతనపల్లిలో నాలుగు, బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 11 మద్యం దుకాణాలున్నాయి.
మున్సిపాలిటీలకు సమీపంగా ఇతర మండలాల్లో మరో 20 మద్యం దుకాణాలున్నా యి. ప్రతి రోజు ప్రచారం చేసిన తర్వాత అభ్యర్థుల వెంట తిరిగే వారికి ఓ క్వార్టర్, బిర్యాణి ప్యాకెట్లు అందజేసి పంపిస్తున్నారు. మరోవైపు రాత్రి కాలనీ పెద్దలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తదనంతరం వారికి లిక్కర్ సీసాలు పంపిణీ చేస్తున్నారు. ఇలా ఒక్కో అభ్యర్థి ప్రతి రోజు మూడు నుం చి నాలుగు వందలకుపైగానే క్వార్టర్ బాటిళ్లు పంపిణీ చేస్తున్నారు.
పల్లె వైన్స్‌ల నుంచి మున్సిపాలిటీలకు తరలింపు..
కార్పొరేషన్‌తో పాటు నాలుగు మున్సిపాలిటీల్లోని 149 వార్డులకు ఎన్నికలు జరుగు తుండగా 693 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో ప్రధాన పార్టీలైన కాంగ్రె స్ నుంచి 148 మంది అభ్యర్థులు, బీఆర్‌ఎస్ నుంచి 139 మంది, బీజేపీ నుంచి 132 మంది, ఆల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) నుంచి 28, బీఎస్పీ నుంచి 18, సీపీఐ నుంచి 17, జనసేన నుంచి 16, ఆప్ నుంచి తొమ్మిది మంది, ఏఐఎంఎం నుంచి నలుగురు, ఇతర పార్టీల నుంచి ఎనిమిది మంది, ఇండిపెండెంట్లు 168 మంది ఉన్నారు.
ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలతో పాటు ఇతర పార్టీలు, ఇండిపెండెం ట్లు సైతం పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. దీనితో వైన్ షాపుల్లో మద్యం కొరత తలెత్తుతోంది. 693 మంది అభ్యర్థులు ప్రతి రోజు సగటున 200 క్వార్టర్ సీసాలు పంచి నా సుమారు లక్షా 35 వేల మద్యం సీసాలు పం పకాలు సగటునా జరుగుతున్నాయి. దీనితో మున్సిపాలిటీల్లోని వైన్ షాపులతో పాటు పల్లెల్లోని వైన్ షాపుల నుంచి పోటీ లో ఉన్న అభ్యర్థులు పది రూపాయలు ఎక్కువ ఇచ్చి మరి కాటన్‌ల కొద్ది క్వార్టర్ సీసాలను తీసుకువెళుతున్నారు. దీనితో వైన్ షాపుల్లో క్వార్టర్ సీసాల కొరత ఏర్పడుతుంది.
మీడియం బ్రాండ్‌ల పైనే దృష్టి
ఎన్నికల కోసం అభ్యర్థులందరు మీడియం బ్రాండ్‌ల క్వార్టర్ సీసాల కోసం వైన్స్‌లను జల్లెడ పడుతున్నారు. మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ ధరవి కాకుండా చూసుకుంటున్నారు. ప్రతి వైన్ షాపునకు కోటా ప్రకారమే లిక్కర్ వస్తుంటుంది. అందరు మీడి యం ధర కలిగి ఉండే బ్రాండ్‌ల సీసా లే కొనుగోలు చేస్తుండటంతో వాటి కొరత మరీ ఎక్కువగా ఏర్పడుతుంది.