calender_icon.png 15 November, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఇందిరమ్మ’కు ఇసుక కొరత!

15-11-2025 12:41:38 AM

-నిలిచిపోయిన భవన నిర్మాణ పనులు

-ఇసుక ఉన్న.. సరఫరా చేయని వైనం

-ఇసుక కొరత సృష్టించొద్దని ఆదేశించిన ముఖ్యమంత్రి..  మరి బేకతర్ చేస్తున్నది ఎవరు

-దిక్కుతోచని స్థితిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు

-పట్టించుకోని మైనింగ్ శాఖ అధికారులు

గద్వాల, నవంబర్ 14: ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు మంజూరు అయినప్పటికీ నిర్మాణ దశలోనే ఇసుక కొరతతో ఆగిపోతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో గత రెండు నెలలుగా ఇసుక సరఫరా ఆగిపోవడంతో లబ్ధిదారులు దిక్కుతో చని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరా చేయాలని ఆదేశించిన ఇక్కడి అధికారులు మాత్రం పట్టించుకో వడం లేదు అని ప్రజలు గోగ్గోలు పెడుతున్నారు.

గత మూడు నెలల నుండి జిల్లాలో అందాజా 900 మంది లబ్ధిదారులు ఇసుక సరఫరా కోసము ప్రభుత్వానికి సుమారుగా రూ ఒక కోటి 80 లక్షలు మీ సేవలో కట్టినప్పటికీ ఇప్పటిదాకా ఇసుక సరఫరా చేయక పోవడంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఏమి చేయాలో స్థితిలో పడిపోయారు. నిర్మాణం కోసం ముగ్గు వేసినప్పుడు మీ సేవలో ఇసుక కొరకు డబ్బులు కట్టిన ఇప్పటిదాకా ఇసుక సరఫరా కాలేదని డస్ట్ తోనే ఇంటి నిర్మాణం చేపట్టాల్సి వస్తుందని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లాలో వివరాలు ఇలా..

జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల నియోజకవర్గంలో 2371 ఇంటి నిర్మాణాలకు గాను 1564 ఇండ్లకు బేస్మెంట్ లెవెల్ పూర్తికాగా ఆలంపూర్ నియోజకవర్గంలో 2103 ఇంటి  నిర్మాణాలకు గాను 1553 ఇండ్లు బేస్మెంట్ పూర్తయినది. ఇసుక సరఫరా ఆగిపోవడంతో అవి నిర్మాణ దశలోనే ఉన్నాయి. నడిగడ్డ కు చెందిన అధికార పార్టీ నేత అనుచరులు, కాంట్రాక్టర్ మధ్య ఇసుక కమిషన్ల పంచాయతీ నడుస్తున్నదని వీరి మధ్య రాజీ కుదరడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీంతో జిల్లాలో రాజోలి మండలం తుమ్మిళ్ల దగ్గర ఇసుక రీచ్ ఉండగా జిల్లాలో ఇందిరమ్మ గృహాలకు ఇక్కడినుండే ఇసుక సరఫరా అవుతున్నది. గత నెల నుండి ఇసుక సరఫరా కొనసాగకపోవడంతో ఇంటి నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి ఇసుక రవాణా ఎప్పుడు ప్రారంభమవుతుందో.. ఎప్పుడు పనులు ప్రారంభించుకోవలో అని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. 

పంతం వీడని కాంట్రాక్టర్ 

అటు టెండర్ పొందిన కాంట్రాక్టర్ పంతం విడకపోవడంతో అధికారులు ఏం చేయాలో తోచడం లేదు. వీరికే కాకుండా ఇతర నిర్మాణాలు చేపడుతున్న వారు తమ నిర్మాణాలను నిలుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది ఇక్కడ అధికార పార్టీ నేతలు కాంట్రాక్టర్ల మధ్య కమిషన్ల పంచాయతీ తెగకపోవడంతో అధికారులు తలలు పట్టుకుం టున్నారు.

అధికారులు కాంట్రాక్టర్ కి, ఇటు అధికార పార్టీ నేతలకు చెప్పలేక సంకట పరిస్థితి ఎదుర్కొంటున్నారు జిల్లా కేంద్రానికి సమీపంలోనే తుంగభద్రా నదిలో ఇసుక నిల్వలు అనుకున్న స్థాయిలో ఉన్నప్పటికీ జిల్లాలో గృహ నిర్మాణదారులకు ఇసుక దొరకక ఇండ్ల నిర్మాణాలు ఇక్కడిక్కడ నిలిచిపోయాయి ఎందుకు ప్రధాన కారణం ఇసుక రీచును దక్కించుకున్న కాంట్రాక్టర్ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధికి మధ్య సయోధ్య కుదరకపోవడమే అని జిల్లాలోని ప్రజలు అనుకుంటున్నారు. 

తుంగభద్ర నుండి ఆంధ్ర కు ఇసుక తరలింపు..

 తెలంగాణ పరిధిలో ఇసుక రవాణా నిలిచిపోవడంతో కాంట్రాక్టర్ తుంగభద్ర నది నుంచి  ఇసుకను నదిలో నుంచి తీసి పడవల్లో ఆంధ్ర ప్రాంతానికి తరలించుకుని సొమ్ము చేసుకుంటున్నట్లు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.  తుమ్మిల్లా రీచ్ నుంచి ఇసుక సరఫరా చేయడానికి రాజమండ్రి కి చెందిన కాంట్రాక్టర్ 7.25 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తీసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు జులై 8 తర్వాత తవ్వకాలు ప్రారంభించారు లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న మేరకు అధికారులు సూచించిన రూట్ మ్యాప్ ప్రకారం తమ్మిళ్ళ నుంచి టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా చేస్తున్నారు. 

ఈ రవాణాకు అధికార పార్టీ నేతలు నుంచి అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ కాంట్రాక్టర్ అడ్డంకులను ఎదుర్కొంటూ ఇందిరమ్మ ఇండ్ల లతో పాటు గృహహిత నిర్మాణాలకు ఇసుక సరఫరా చేస్తున్నారు.  అయితే గత నెల నుండి నడిగడ్డ అధికార పార్టీకి చెందిన ఓ నేత అనుచరులు ఇసుక టిప్పర్ల అడ్డుకోవడం తమ నేతతో మాట్లాడిన తర్వాత ఇసుక తరలించాలని చెప్పడంతో కాంట్రాక్టర్ గత 20 రోజులుగా ఇసుక సరఫరా ఈ విషయం కాంట్రాక్టర్ మైనింగ్ అధికారులతో పాటు ఇతర ఉన్నదా అధికారులకు తెలియజేసిన ఫలితం లేకుండా పోయింది.

ఇసుక దొరక్క..ఇంటి నిర్మాణాలు ముందుకు సాగక..

అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇతర గృహ నిర్మాణదారుల పరిస్థితి ఉన్నది. నిర్మాణాలకు అవసరమైన ఇసుక అందుబాటులో ఉన్నప్పటికీ దానిని వినియోగించు కోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కేంద్రం జీఎస్టీ తగ్గించడంతో సిమెంట్ బస్తాల ధరలు తగ్గడంతో ఇల్లు ఇతర నిర్మాణాలు నిర్మించుకునేందుకు వినియోగదారులు ముందుకు వస్తున్న తరుణంలో ఇసుక సరఫరా వారి నిర్మాణాలకు తీవ్ర ఆటంకంగా మారింది.

జిల్లాలో ఇసుక నిల్వలు ఉన్నప్పటికీ దానిని రాజకీయ జోకే కారణంగా తీసుకోలేని పరిస్థితి నెలకొంది.  కాంట్రాక్టర్ నేను నిబంధనల ప్రకారమే ఇసుకు సరఫరా చేస్తున్నామని ఎవరికీ ముడుపులు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని పంతం పట్టి కూర్చోవడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు.

ముడుపుల విషయం ఉన్నతాధికా రులకు తెలియజేసిన వారు పట్టించుకోవడం లేదని కాంట్రాక్టర్ వాపోయారు. ఇంత జరుగుతున్నప్పటికీ జిల్లా మైనింగ్ శాఖ అధికారులకు చీమకుట్టినట్టు లేదని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో పాటు ఇతర గృహ వినియోగదారులు వాపోతున్నారు.  కాంట్రాక్టర్ రాజకీయ నాయకుల మధ్య ఉన్న పంచాయతీ మాకు శాపంగా మారిందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి కైనా జిల్లా అధికారులు స్పందించి ఇసుక సరఫరా చేసినట్లయితే ఇంటి నిర్మాణ పనులు వేగవంతం అవుతాయని వినియోగదారులు తెలిపారు. 

పది రోజుల్లో ఇసుక సరఫరా చేస్తాం 

ఈ విషయంపై జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారిని అడగగా గత మూడు నెలలుగా ఇసుక సరఫరా ఆగిపోయిన మాట వాస్తవమేనని దీనిని త్వరలో పరిష్కరించి పది రోజుల్లో ఇసుక సరఫరా చేస్తామని తెలిపారు