calender_icon.png 12 December, 2025 | 12:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వార్డుల పునర్విభజనపై రచ్చ!

12-12-2025 12:00:00 AM

  1. 16న స్పెషల్ కౌన్సిల్ మీటింగ్

ఫిబ్రవరి 10తో ముగియనున్న పాలకమండలి గడువు

పదవీకాలం చివర్లో మేయర్ పాట్లు

అధికారులపై పట్టు కోసం విఫలయత్నం

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 11 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు మరో 60 రోజుల్లో, అంటే 2026 ఫిబ్రవరి 10వ తేదీతో ముగియనుంది. పదవీకాలం ముగుస్తున్న తరుణంలో 27 మున్సి పాలిటీల విలీనం, మరోవైపు 300 వార్డుల పునర్విభజన, ఇంకోవైపు బడ్జెట్ రూపకల్పన వెరసి చివరి రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం, పాలక వర్గం పరుగులు పెడుతోంది.

ఈ క్రమంలో ఈ నెల 16న జరగబోయే ప్రత్యేక కౌన్సిల్ సమావేశం హైటెన్షన్‌కు వేదిక కానుంది. గడువు సమీపిస్తుండటంతో పెండింగ్ పనులను, విధానపరమైన నిర్ణయాలను కొలిక్కి తెచ్చేందుకు వరుస సమావేశాలు ప్లాన్ చేశా రు.

డిసెంబర్ 16 కౌన్సిల్‌లో వార్డుల డీలిమిటేషన్  ముసాయిదాపై కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల అభిప్రాయాలు, అభ్యంతరాల స్వీకరణ కోసం ప్రత్యేక సర్వసభ్య సమా వేశం జరగనుంది. డిసెంబర్ 18 స్టాండింగ్ కమిటీ సమావేశంలో కొత్తగా విలీనమైన 27 సర్కిళ్లను కలుపుకుని 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీహెచ్‌ఎంసీ వార్షిక బడ్జెట్‌పై చర్చించి, ఆమోదించేందుకు స్టాండిం గ్ కమిటీ భేటీ కానుంది. 

అధికారులపై పట్టు సాధించని మేయర్?

2020లో కరోనా సెకండ్ వేవ్ సమయం లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి, 20 21 ఫిబ్రవరి 11న మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన గద్వాల్ విజయలక్ష్మి ప్రస్థానం ఒడిదుడు కులమయంగా సాగింది. బంజారాహి ల్స్ కార్పొరేటర్‌గా గెలిచి మేయర్ పీఠం ఎక్కిన ఆమె.. గత నాలుగున్నరేళ్లలో అధికారులపై పూర్తి స్థాయి పట్టు సాధించలేక పోయారనే విమర్శలు బలంగా ఉన్నాయి. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆమె సొంత పార్టీ కార్పొరేటర్లే ఆమె తీరుపై బహిరంగ విమర్శలు చేశా రు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతను సైతం పక్కనబెట్టారనే ఆరోపణలు వచ్చాయి.

కౌన్సిల్ సమావేశాల్లో సభ్యులు అడిగే ప్రశ్నలను దాటవేస్తూ, అధికారులను కాపాడుకుంటూ వచ్చా రనే అపవాదు మేయర్‌పై ఉంది. ఇప్పుడు పదవీకాలం ముగుస్తున్న సమయంలో కనీసం ఈ 60 రోజులైనా తనకు సహకరించాలని ఆమె అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసిన ట్లు సమాచారం. జోనల్ కమిషనర్లకు అడిషనల్ పవర్స్ ఇచ్చేలా కమిషనర్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు భోగట్టా. 

అధికార పక్షంపై బీజేపీ ఒత్తిడి?

విలీనం, వార్డుల విభజన అంశాన్ని అస్త్రం గా చేసుకుని అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టేందుకు బీజేపీ కార్పొరేటర్లు సిద్ధమయ్యా రు. ఇప్పటికే ఈ నెల 10న మేయర్‌ను, గురువారం కమిషనర్‌ను కలిసిన బీజేపీ బృందం.. పునర్విభజన ప్రక్రియపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వార్డుల విభజన శాస్త్రీయంగా జరగలేదని, కేవలం మజ్లిస్ రాజకీయ లబ్ధి చేకూర్చేలా హద్దులు మార్చారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నెల 16న జరిగే కౌన్సిల్ సమా వేశంలో ఈ విషయంపై నిలదీసేందుకు, అవసరమైతే సభను స్తంభింపజేసేందుకు బీజేపీ కార్పొరేటర్లు వ్యూహరచన చేస్తున్నారు.