12-12-2025 12:00:00 AM
చేవెళ్ల, డిసెంబర్ 11 (విజయక్రాంతి) : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నేడు చేవెళ్ళ మండలం గొల్ల గూడ గ్రామంలో విస్తృతంగా పర్యటించి, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చెవుల నిర్మల నర్సింలును గెలిపించాలని కోరిన భీమ్ భరత్ అన్నారు. ఈ సందర్భంగా భీమ్ భరత్ గారు మాట్లాడుతూ... పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ గ్రామాలలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసామని, సకాలంలో వారికి బిల్లులు వారి అకౌంట్‌లలో పడుతున్నాయని, ఏప్రిల్ లో రెండో విడత ఇండ్లకు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదని, తద్వారా గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచాయన్నారు, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటున అందించాలని ఆయా గ్రామాల ప్రజలను కోరారు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని, 10 లక్షల ఆరోగ్యశ్రీ, 500 కే సిలిండర్, రెండు లక్షల రుణమాఫీ చేశామని, దేశంలో ఎక్కడ లేని విధంగా రేషన్ పై సన్నబియ్యాన్ని ఇస్తున్నామని తెలిపారు.
నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని ఆశీర్వదించాలని, గ్రామాల అభివృద్ధి అభివృద్ధిలో మీరు సైతం భాగస్వాములై, కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించి, గెలిపించాలని గ్రామస్తులను కోరిన చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ గారు. వీరితో పాటుగా పాల్గొన్న చెవుల గుజిరయ్య, కరినోళ్ల సత్తయ్య, దోసాడ వెంకటేష్, చంద్య్రోళ్ళ శంకరయ్య, మోతే శ్రీశైలం, పాతెపురం వాసుదేవ్, పాపాయిల్లా ఆంజనేయులు, బుల్కాపూర్ శంకరయ్య, తదితర నాయకులు, భారీ సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.