18-06-2025 12:00:00 AM
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
మునుగోడు, జూన్ 17 : నియోజకవర్గంలోని ప్రతి రోడ్డు 5.5 మీటర్ల వెడల్పు ఉండాల్సిందేనని రోడ్ల నిర్మాణంలో నాణ్యతపై రాజీ పడేది లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖ ల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రోడ్ల పనుల పురోగతిపై మునుగోడు లోని అధికారిక క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి అధికారులు, రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు.
సాగర్ రోడ్డు నుండి ముష్టిపల్లి వరకు, ముష్టిపల్లి నుండి నాంపల్లి వరకు జరుగుతున్న ఆర్ అండ్ బి రోడ్ల పనులు ఎంతవరకు వచ్చాయని కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.అంగడిపేట నుండి లెంకలపల్లి వరకు చేపట్టబోయే రోడ్డు పనులకు సంబంధించి టెండర్ ప్రొసీజర్ ఎంతవరకు వచ్చిందని,నాంపల్లి నుండి ఇడికుడ వరకు, ఇడికుడ నుండి కమ్మగూడెం(తెరట్ పల్లి) వరకు ఉన్న పంచాయతీరాజ్ రోడ్లను ఆర్ అండ్ బి రోడ్లుగా మార్చిన తర్వాత వాటి పనులకు సంబంధించి పురోగతిపైఆరాతీశారు.