28 June, 2026 | 1:50 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రిని కలిసిన టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి

18-06-2025 12:00 AM

సన్మానించిన కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్

కామారెడ్డి, జూన్ 17 (విజయ క్రాంతి): ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర  పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, (గ్రామీణ నీటి సరఫరాతో సహా, స్త్రీ శిశు సంక్షేమం, మంత్రివర్యులు సీతక్కను మంగళవారం కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం హిందూప్రియ, ఇటీవల టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లతో కలిసి మంత్రిని సన్మానించారు.

మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం కామారెడ్డి సమస్యలను మంత్రికి విన్నవించినట్లు టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మర్యాదపూర్వకంగా కలిసిన ట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ సందర్బంగా సీతక్క కు పుష్పగుచ్చం అందించారు. తనకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క కోరినట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డిలో పార్టీ పరిస్థితిని సీతక్క అడిగి తెల్సుకున్నారని తెలిపారు.

కామారెడ్డి అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరగా, మంత్రివర్యులు సీతక్క, సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో, మాజీ మున్సిపల్ చైర్మన్, గడ్డం ఇందుప్రియ, మాజీ కౌన్సిలర్లు, జూలూరి సుధాకర్, పంపరి లతా శ్రీనివాస్,పాత శివ కృష్ణమూర్తి, చాట్ల వంశీ కృష్ణ, పిడుగు మమతా సాయిబాబా, సలీం,  తదితరులు పాల్గొన్నారు.