calender_icon.png 5 July, 2025 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు రంగుల జెండా పట్టి కల్వకుంట్ల గడీలు బద్దలు కొట్టినం

05-07-2025 01:49:01 AM

  1. తెలంగాణ దేశానికే ఆదర్శం
  2. రైతులకు 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు అందించినం 
  3. చర్చకు ఎవరు వస్తారో రండి
  4.   60 వేల ఉద్యోగాల భర్తీలో ఒక్కటి తగ్గినా క్షమాపణ చెప్తా
  5. సామాజిక న్యాయ సమర భేరీ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): మూడు రంగుల జెండా పట్టి కల్వకుంట్ల దొరల గడీలను బద్దలు కొట్టామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చటేనని, సంక్షేమ పథకాలు అమలు చేయలేరని, కలిసి ఉండరని చాలా మంది ఎగతాళి చేశారని గుర్తు చేశారు. కానీ నవ్విన వాళ్ల ముందు తలెత్తుకుని నిలబడి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టామని స్పష్టం చేశారు.

తెలంగాణ మోడల్‌ను దేశం అనుసరించేలా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. రాష్ట్రం లో కులగణనను పూర్తి చేసి బీసీల లెక్క తే ల్చామని చెప్పారు. ప్రతిపక్షాలకు చెంప పెట్టులాగా కేవలం 9 రోజుల్లో రూ. 9 వేల కోట్ల నిధులను రైతు భరోసా కింద అందించిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర భేరీ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

అధికారంలోకి వచ్చే నాటికి దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ ఉన్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్నామని వెల్లడించారు. 18 నెలల్లోనే రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, పేదలకు సన్న బియ్యం, రైతు రుణమాఫీ చేసి రైతుల రుణ విముక్తులని చేశామన్నారు. వరి వేస్తే ఉరే అని నాటి పాలకులు బెదిరించారని, కానీ తాము సన్న వడ్ల కు బోనస్ ఇచ్చి రైతే రాజు అనే మాటను ని జం చేశామని తెలిపారు. అత్యధిక వరి ధా న్యం పండించి తెలంగాణను దేశంలోనే నెం బర్‌వన్‌గా నిలబెట్టామని చెప్పారు. 

ఎవరు వస్తారో రండి 

ఢిల్లీలో ఉండే మోడీ అయినా, గల్లీలో ఉండే కేడీ అయినా రైతు సంక్షేమం విషయంలో తేల్చుకునేందుకు రావాలని సవా ళ్లకు సిద్ధమని రేవంత్‌రెడ్డి అన్నారు. రైతుల కోసం ఏ ప్రభుత్వం ఎక్కువ చేసిందో బహిరంగ చర్చకు రావాలని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. మోదీ వస్తారో, కిషన్ రెడ్డి వస్తారో, కేసీఆర్ వస్తారో రండి.. చర్చించేందుకు సిద్ధమన్నారు. రైతులకు మేలు చేసింది ఎవరో అసెంబ్లీలో చర్చిద్దామని ఛాలెంజ్ చేశారు.

రూ. 5 భోజనం పెట్టే కార్యక్రమానికి ఇందిరమ్మ పేరు పెడితే కొందరు సన్నాసులు విమర్శలు చేస్తున్నారని, పేదల సంక్షేమం అంటేనే ఇందిరమ్మ.. ఇందిరమ్మ అంటేనే పేదల సంక్షేమం అని స్పష్టం చేశారు. ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు లు అద్దెకు అందించి లాభాలు గడించేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించామని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టామని వెల్లడించారు. 

60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం

 ప్రజాప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని చెప్పారు. దీనిపై మోడీ, కేసీఆర్, కేటీఆర్ చర్చ పెట్టాలని, ఒక్క ఉద్యోగం తక్కువ ఇచ్చినట్టు నిరూపించినా క్షమాపణ చెబుతానని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ పాలనలో యువతను గొర్రెలు, బర్రెలు కాయాలని, చెప్పులు కుట్టుకోవాలని, చేప లు పట్టుకోవాలని వారి కులవృత్తుల్లోకి మళ్లీ వాళ్లని నెట్టాలని చూశారని మండిపడ్డారు. 

ఏడాదిన్నరలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు

ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో రాష్ట్రానికి రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని తెలిపారు. వంద నియోజకవర్గాల్లో రూ. 20 వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంతో పోటీపడేలా మన విద్యా ప్రమాణాలు ఉండాలని ప్రణాళికలు వేసుకున్నట్టు వెల్లడించారు. యువతకు నైపుణ్యాన్ని అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుంటున్నామని వివరించారు. 

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా..

 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మొదటి సం వత్సరం రూ. 21 వేల కోట్ల వడ్డీ లేని రుణా లు మహిళా సంఘాలకు అందించామన్నారు. 93 లక్షల కుటుంబాలకు రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం ఉచితంగా పంపి ణీ చేస్తున్నామని, ఇందుకోసం రూ.13,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు రాష్ర్టంలో యంగ్ ఇం డియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తున్నామన్నారు. ఒక్కో పాఠ శాలను 25 ఎకరాల్లో రూ.200 కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నామని, ఒకేసారి 105 స్కూల్స్ మంజూరు చేశామన్నారు. అటవీ హక్కుల చట్టం కింద రాష్ర్టంలోని పేద గిరిజనులకు పంపిణీ చేసి 6.70 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు ఇందిరా సౌర గిరిజన వికాస పథకం కింద రూ.12,5 00 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.  

కార్యకర్తలే బ్రాండ్ అంబాసిడర్లు

కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించాలని, ఈ యుద్ధంలో కల్వకుంట్ల కు టుంబం బద్ధలు కావాలని పిలుపునిచ్చారు. త్వరలో వచ్చేవి కార్యకర్తల ఎన్నికలు అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యకర్తలకు నూటికి నూరు శాతం న్యాయం చేసే బాధ్యత తనదేనని చెప్పారు. రాబోయే రోజు ల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య 150 కిపైగా పెరగబోతోందన్నారు. మహిళా రిజర్వేషన్ రాబో తోందని, 60 మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. 

 అభివృద్ధిని గడప గడపకు తీసుకువెళ్లాలి: డిప్యూటీ సీఎం భట్టి 

ప్రజా ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షే మ కార్యక్రమాలను గడప గడపకు తీసుకువెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  పిలుపునిచ్చారు.  సామాజిక న్యాయ సభలో డిప్యూ టీ సీఎం భట్టి  మాట్లాడుతూ పది సంవత్సరాలపాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్‌ఎస్ అడ్డగోలుగా దోపిడీకి పాల్పడిందని ఆరో పించారు.  రాష్ర్ట ప్రజలను బీజేపీ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలకు సరైన సమాధానం చెప్తామన్నారు. 

అధికారం లోకి వచ్చిన మూడు నెలల్లోనే రెండు లక్షల రుణమాఫీ కింద 69 లక్షల రైతుల పక్షాన రూ.21,832 కోట్ల రూపాయలు రాష్ర్ట ప్రభు త్వం బ్యాంకర్లకు చెల్లించిందని తెలిపారు. 42 లక్షల మంది రైతులకు ప్రభుత్వమే రూ.2,181 కోట్ల ఇన్సూరెన్స్ చెల్లించిందన్నారు. అకాల వర్షాలకు పంట నష్టం కింద రూ. 260 కోట్లు విడుదల చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు. ఉచిత విద్యుత్ కింద  29 లక్షల పంప్ సెట్ల గాను  ప్రభుత్వం ఇప్పటివరకు 17 వేల కోట్లు విద్యుత్ సం స్థలకు కట్టామన్నారు.