12-11-2025 04:25:31 PM
ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసిన ఏడీఏ రమేష్ బాబు..
తుంగతుర్తి (విజయక్రాంతి): వచ్చే రబీ సీజన్ కు యూరియా కొరత లేదని 100 నుండి 120 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని యూరియా కొరకు రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని వ్యవసాయ సహాయ సంచాలకులు రమేష్ బాబు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో స్టాక్‌ను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. దుకాణాల లైసెన్సును పరిశీలించారు. ఎరువుల వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేశారు.
ఎరువులను పీఓఎస్ మిషన్ ద్వారానే విక్రయించాలని, రైతుల వివరాలు పూర్తిగా నమోదు చేయాలన్నారు.రైతులు ఆధార్ కార్డు తీసుకున్న తర్వాతే ఎరువులు విక్రయించాలని, ప్రతి రైతుకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని ఆయన దుకాణ యజమానులకు స్పష్టం చేశారు. ఫెర్టిలైజర్ నిర్వాహకులు తప్పనిసరిగా రికార్డులు రాయాలని, రాయని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.