calender_icon.png 12 November, 2025 | 5:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు ఉచిత కంటి శిబిరంతో ఎంతో మేలు

12-11-2025 04:23:16 PM

జడ్చర్ల: పట్టణంలో జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో లయన్స్ క్లబ్ జడ్చర్ల ఆధ్వర్యంలోహరిజనవాడ ప్రాథమిక పాఠశాలకు చెందిన 100 మందికి  పైగా విద్యార్థులకు ఉచిత కంటి శిభిరంలో పాల్గొన్నారు.  శిబిరమును మున్సిపాలిటీ చైర్మన్ కోనేటి పుష్పలత, వైస్ చైర్మన్ పాలది సారిక, లయన్స్ క్లబ్ జడ్చర్ల అధ్యక్షులు ధ్రువ బాదిమి, స్థానిక కౌన్సిలర్ రమేష్ , పాఠశాల హెచ్ఎం గోవింద్ నాయక్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ పిల్లల ఈ కాలంలో సెల్ ఫోన్, టీవీలు ఎక్కువగా చూడటం వలన కంటికి జరిగే నష్టలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు గొప్పవి అని, వారికీ కావలసిన పూర్తి సహకారం అందిస్తాము అని వ్యక్తపరిచారు. అలాగే కంటి అద్దాలు కావలసిన వారికి ఉచితంగా ఇస్తాము అని రాబోవు కాలంలో మరిన్ని సేవ కార్యక్రమాలను చేపడుతాము అని లయన్స్ క్లబ్ అధ్యక్షులు ధ్రువ బాదిమి,సెక్రటరీ కాల్వ రామ్ రెడ్డి, కోశాధికారి కొండూరు వెంకటేష్ లు తెలిపారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పెద్దలు , పాఠశాల సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు.