12-08-2025 12:38:37 AM
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల అర్బన్, ఆగస్టు 11(విజయ క్రాంతి): జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులందరికీ సరిపడే యురియా అందుబాటులో ఉన్నందున రైతులు ఆందోళన చెంద వద్దని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి ల క్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారులు,సొసైటీ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంత రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.జిల్లాకు సంబంధించి న రైతాంగం మొత్తం యూరియా విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటు న్న దృష్ట్యా ఈ రోజు జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో కలిసి సమావేశాన్ని ఏ ర్పాటు చేసి పలు అంశాలపై చర్చించడం జరిగిందన్నారు.గత ఏడాది ఆగస్టు నెల వరకు 23వేల 3 వందల మెట్రిక్ టన్నుల యూరియాను ఆయా గ్రామాల్లో రైతులకు అందజేయడం జరిగిందన్నారు.
ఈ ఏడాది ఇప్పటి వరకూ సుమారు 21 వేల మెట్రిక్ ట న్నుల యూరియాను సొసైటీల ద్వారా రై తాంగానికి అందజేయడం జరిగిందని తెలిపారు.ఇంకా 2 వేల మెట్రిక్ టన్నుల యూరియా గోదాములో నిల్వ ఉందని స్ప ష్టం చేశారు.ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో మాట్లాడటం జరిగిందని అదేవిధంగా డిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రిని కూడా కలిసి యూరియా విషయం వివరించడం జరిగిందన్నారు.
చైనా నుండి ముడి సరుకు దిగుమ తి కొంత ఆలస్యం కావడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని కేంద్ర మంత్రి చెప్పారన్నారు.రై తులకు యూరియా పరంగా ఎటువంటి ఇ బ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకునే బాధ్యత ప్రభుత్వానిదన్నారు.రైతులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని,ప్రతి ఒక్కరికీ సరిపడ యూ రియాను అందిస్తామని మంత్రి వివరించా రు.
సకాలంలో వర్షాలు కురువక రైతులు ఇబ్బందులు పడుతున్నారని గమనించి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయించామని మంత్రి తెలిపారు. ఎస్సారెస్పీలో 44.49 టిఎంసిల నీటి నిలువలు ఉన్నాయని, మొదటి విడతగా జోన్ 1 కు నీటిని విడుదల చేసినట్టు మంత్రి తెలిపారు.
తాము కోరగానే స్పందించి నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో రైతు పక్షపాత ప్రభుత్వం అధికారంలో ఉన్నందున రైతులకు ఏ కష్టం రాకుం డా చూసుకునే బాధ్యత తమపై ఉందని మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నాయకులు గిరి నాగభూషణం, ఆడవాల లక్ష్మణ్ పాల్గొన్నారు.