calender_icon.png 12 August, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ గురుకులాలకు 113 కోట్లు

12-08-2025 12:37:55 AM

ఉత్తర్వులు జారీచేసిన బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఈ శ్రీధర్

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాలకు రాష్ట్రప్రభు త్వం రూ.113.38 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఈ శ్రీధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశా రు. బీసీ గురుకులాల పరిధిలోని ఉన్నత పాఠశాలలు, జూనియర్ కాలేజీల అవసరాలకు నిధులు వినియోగించుకోవాలని, ఆర్థిక శాఖ సూచనల మేరకు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్, బీసీ గురుకులాల కార్యదర్శి తదుపరి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.