calender_icon.png 12 August, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నులిపురుగు మాత్రలు తప్పనిసరి వేసుకోవాలి

12-08-2025 12:40:31 AM

పరిగి, ఆగస్టు 11 ( విజయ క్రాంతి) :   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పరిగి పట్టణంలోని జడ్పిహెచ్‌ఎస్ నెంబర్ వన్ పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ..నులిపురుగుల నివారణ ద్వారా చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుందన్నారు.

19 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల లో చదువుతున్న వారు తప్పనిసరిగా మాత్రలను వేసుకోవాలి అని సూచించారు.  పాఠశాలలో అవసరమైన మౌలిక వసతుల గురించి ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి స్పందించి సంబంధిత పనులను త్వరగా పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.

పాఠశాల గ్రౌండ్ లో సీసీ రోడ్ బెడ్ వేయాలని ఉపాధ్యాయులు కోరగా,వెంటనే రూ.7 లక్షలు మంజూరు చేసి,నిర్మాణ పనులకు పూజ నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శులు హనుమంతు, రామకృష్ణ, డిసిసి ఉపాధ్యక్షులు లాలు కృష్ణ, వైస్ చైర్మన్ అయుబ్, మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, ఎంపీడీవో కరీం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ, కాంగ్రెస్ నాయకులు వెంకటేష్, అక్బర్, ఉపాధ్యాయులు, విద్యార్థులుపాల్గొన్నారు.