calender_icon.png 13 June, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు

13-06-2025 12:52:21 AM

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, జూన్ 12 ( విజయక్రాంతి ) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామమే లేదని, మొదటి నుంచి నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చింది కేవలం కాంగ్రెస్ సర్కారేనని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. గురువారం వనపర్తి నియోజకవర్గ పరిధిలోని ఘనపురం, పెద్దమందడి, శ్రీరంగాపురం, పెబ్బేరు మండలం, పెబ్బేరు మున్సిపాలిటీలలోని దాదాపు 1600 మంది ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు ఇళ్ల పట్టాలను వేరువేరుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల బి ఆర్ ఎస్ పాలనలో సంవత్సరానికి 5 ఇండ్లు కట్టుకుంటూ పోయిన ఇప్పటివరకు నిరుపేదలకు సొంత గూడు ఏర్పడి ఉండేదని, గూడు లేని నిరుపేదలు సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పట్టింపు లేకుండా ప్రవర్తించారని ఆయన విమర్శించారు.

రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే ప్రతి ఒక్కరిని మీరు గెలిపించి నాకు సహకరించాలన్నారు. ఇతర పార్టీలను గెలిపిస్తే అభివృద్ధికి ఆటంకాలుగా మారుతారని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అధికారులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.