బంగారం తరలింపులో విశేషమేమీ లేదు
08-06-2024 12:05 AM
దేశంలో స్టోరేజీ సామర్థ్యం ఉన్నందునే తెచ్చాం
రిజర్వ్‌బ్యాంక్ 100 మెట్రిక్ టన్నుల బంగారాన్ని బ్రిటన్ నుంచి భారత్‌కు తీసుకురావడాన్ని విశేషంగా చూడవద్దని గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. ఇప్పుడు దేశంలో బంగారాన్ని నిల్వచేసే సామర్థ్యం తగినంతగా ఉన్నందునే యూకే నుంచి తరలించుకువచ్చామని తెలిపారు. చాలా ఏండ్లుగా విదేశీ వాల్ట్స్‌లో ఉన్నదని, అందులో కొంత దేశంలో నిల్వ చేయడానికి తీసుకురావాలని నిర్ణయించామన్నారు. ‘ఇటీవలి సంవత్సరాల్లో రిజర్వ్‌బ్యాంక్ తన విదేశీ మారక నిల్వల్లో భాగంగా బంగారం కొంటున్నది. దీంతో పుత్తడి పరిమాణం పెరిగింది. మనకు దేశీయ స్టోరేజీ సామర్థ్యం ఉన్నది. అందుచేత కొంత నిల్వను దేశంలోకి తీసుకొచ్చి స్టోర్ చేయాలనుకున్నాం. అంతకు మించి ఈ విషయాన్ని చూడవద్దు’ అని దాస్ చెప్పారు.






