ఓటు విలువ తెలిసేదెప్పుడు?
ఎన్నికల సమయంలో నేతలకు దేవుడిగా కనిపించిన ఓటరు ఆ తర్వాత కనిపించడం లేదు. వారికి అప్పడు అధికారం తప్ప మరేమీ అవసరం లేదు. అందుకే, ఏ పార్టీలో అధికారానికి ఓ అవకాశం ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇటీవలి కాలంలో ఇది మరీ ఎక్కువైంది. ఫిరాయింపులకు అవకాశం లేని బలమైన చట్టాలు లేకపోవడమే ఇందుకు కారణం. ఓటుహక్కు విలువ గురించి ప్రజలకు ఎలా అవగాహన కల్పిస్తున్నారో ఓటరు విలువను నేతలు కూడా గ్రహించేలా, ఫిరాయింపులను కట్టడి చేసే విధంగా చట్టాల్లో మార్పులు చేయాలి.
ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వినియోగించుకోవడం 18 ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీ పురుషుడికి రాజ్యాం గం కల్పించిన హక్కు. ఇందుకోసం ప్రభు త్వం కూడా ఎన్నికల సమయంలో కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నది. వివిధ ప్రచా ర మాధ్యమాల ద్వారా ప్రజలందరూ ఓటు తమ హక్కుగా భావించాలి. 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ‘ఎన్నికల సంఘం’ విస్తృత ప్రచారం చేస్తుంది. ఒకటికి రెండుసార్లు తమ పేరు ఓటరు లిస్టు లో చూసుకోవడానికి ఏర్పాట్లు చేస్తోంది.
ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల అధికారి నుండి కిందిస్థాయిలో పనిచేసే గ్రామ పం చాయతీ అధికారులు, ఉపాధ్యాయులు, పలు కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల విధుల్లో విపరీతంగా కష్టపడతారు. ఎన్నిక ల సమయంలో వృద్ధులకు, అంగ వైక ల్యం వున్నవారికి ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. మిగతా సమ యాల్లో వారంటే ఎవరో కూడా తెలియని ప్రజల కోసం కొండల్లో కోనల్లో వున్నవారిని సైతం వదలకుండా పోలింగ్ సిబ్బంది అష్టకష్టాలు పడుతూ అక్కడిదాకా వెళ్లి వారు ఓటు వేసేలా చూస్తారు. అల్లరు జరగకుండా విస్తృతమైన పోలీస్ బందోబస్తుతో పోలింగ్‌ను నిర్వహిస్తారు. ఫలితాలు వచ్చేవరకు ఓట్లు వేసిన ఆ ఈవీఎంలకు పటిష్ఠమైన బందోబస్తు కల్పిస్తారు. ఇందుకో సం ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించినప్పుడల్లా కోట్లాది రూపాయ ల ప్రజాధనాన్ని వ్యయం చేస్తుంటుంది.
గెలిచిన నాయకుల వైఖరి
ఎన్నికల ఫలితాలలో గెలుపొందిన అభ్యర్థిని బాజా భజంత్రీలతో ఊరేగించి ప్రజలు అభినందిస్తారు. ఇంతవరకు బాగా నే వుంది. గెలిచిన మరు క్షణంలోనే ఆ నాయకుడి కళ్ళకు అధికార పొర కమ్ముతుంది. ప్రచార సమయంలో నమస్కారం పెట్టిన చేతులకు ప్రజలంతా వెర్రిబాగుల్లాగా కనిపిస్తారు. తన ఎన్నిక కోసం కష్టపడిన అధికారులంతా తాబేదార్లుగా తనకు సేవలు చేసేవారిలాగా తోస్తారు. ఏ పార్టీనైతే అభిమానించి ప్రజలు తనను గెలిపించారో ఆ క్షణంలో అది కాస్తా మరిచిపో తారు. అవకాశాన్నిబట్టి మరో పార్టీలోకి జంప్ అవడానికీ ప్రయత్నిస్తారు. అంద రూ ఇలా చేస్తారని కాదు కానీ, ఇటీవల కాలంలో ఇలాంటి వాళ్ల సంఖ్య పెరుగుతున్నది. ఈ రకమైన పనివల్ల నియోజక వర్గంలో తనకు ఓటు వేసిన వేలాదిమందిని ఒక్కసారిగా మోసం చేసినట్టు అవు తుంది. తనను ఎన్నుకున్న ప్రజల నోట్లో మట్టి కొట్టడం అన్యాయం.
ఈ పరిస్థితిలో ప్రజలు ఉపయోగించుకున్న ఓటుహక్కు వల్ల ఏం ప్రయోజనం కలిగినట్టు? ‘కేవలం గెలిపించడమే ప్రజల బాధ్యత, తరువాత నా ఇష్టం’ అనే ధోరణి నేటి నాయకుల్లో బాగా అలవాటయింది. రాజ్యాంగంలోని నిబంధనలు గట్టిగా లేకపోవడమే వీరు ఈ విధంగా ఆడుతున్న నాటకాలకు కారణమవుతోంది. ఒక నాయకుడిని, ఒక పార్టీని నమ్మి తాము వేసిన ఓటు ఇలా వృధా అయినపుడు ఆ ప్రజలు ఏం చేయాలి? ‘ఓటు వేయడం నీ హక్కు’ అని ప్రభుత్వం ప్రజలకు గట్టి నమ్మకం కల్పించడం వల్ల మాత్రమే ప్రజ లు కూడా తమ ఓటును హక్కుగా భావిం చి ఒక నాయకుడిని గెలిపిస్తారు. ఆ నాయకుడు మరో పార్టీలోకి జంప్ అయిపోతే, వాళ్లు వేసిన ఓటు వృధా అయినట్లే కదా? దీనికి రాజ్యాంగం, ప్రభుత్వం, రాజకీయా పార్టీలు ఏం సమాధానం చెబుతాయి?
ఎన్నికల సంస్కరణలు అవసరం
‘గెలిచేంత వరకు ఓడ మల్లన్న, గెలిచిన తరువాత బోడి మల్లన్న’ అన్న మన సామె త ఇప్పటి అనేకమంది నాయకులకు బాగా వర్తిస్తుంది. ఈ విషయంలో చట్టాల ప్రక్షాళన అవసరం. ఒకసారి ఎన్నికైన నాయకుడు మరో పార్టీలోకి మారాలంటే మొదట తన పదవికి, పార్టీకి రాజీనామా చేసిన అనంతరం అతను మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి. పార్టీ అధ్యక్షుడి సంతకంతో నామినేషన్ పత్రం సమర్పించి గెలిచిన వారు పార్టీ మారినపుడు కూడా అదే పార్టీ అధ్యక్షుడి అనుమతిని తీసుకొనే విధంగా చర్య లు అవసరం. ఈ విషయంలో మేధావు లు, న్యాయ నిపుణులు కలిసి ఆలోచించా లి. ఈ విషయమై నూతన సంస్కరణలకు నాంది పలకాల్సిన అవసరం వుంది.
ఓటు విలువ ప్రజలకు తెలుసు గానీ నాయకులకు తెలియడం లేదేమో అనిపిస్తున్నది. నాయకులకు కూడా ప్రజల ఓటు విలువ తెలిసి రావాలి. అప్పుడే దేశ రాజకీయాల్లో మార్పు వస్తుంది. ప్రజలకు సేవ చేసే నాయకులు మాత్రమే చట్టసభలకు ఎన్నికవుతారు. అలాంటి వారివల్ల మాత్ర మే ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు సాధ్యమవుతుంది. పార్టీ ఫిరాయించాలనుకునే నాయకులు సైతం ప్రజ ల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయం కలిగి ఉన్నప్పుడు వాళ్లు పార్టీ మారడానికి భయపడతారు. ప్రస్తుతం ఎన్నికల వేళ పార్టీ ఫిరాయింపులు కప్పల తక్కెడలాగా తయారవుతున్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారో, సీటు రాదని తెలియగానే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వేరే పార్టీలోకి జంప్ చేస్తారో తెలియని పరిస్థితి ఇప్పుడు ఉంది.
కన్నోజు మనోహరా చారి
వ్యాసకర్త సెల్: 7995089083






