calender_icon.png 16 February, 2026 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలమూరుకు పవర్ ఎక్కువ

16-02-2026 12:52:35 AM

ఆ బస్సులు నేరుగా కార్పొరేషన్ కే వచ్చే అవకాశం

టూర్ ఎవరికి తీపి కబురు చెప్పింది

కీలకం కానున్న డిప్యూటీ మేయర్ బాధ్యత 

పట్టణమంతా ఒకటే చర్చ.. మేయర్ మేడం ఎవరు?

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): ఉమ్మడి జిల్లాలోని ఏకైక కార్పొ రేషన్ గా కొలువు మహబూబ్ నగర్ నగ రం. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకే నో డల్ జిల్లా కావడంతో పాటు కార్పొరేషన్ స్థా యికి కూడా ఎదగడంతో ఈ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి జిల్లాలోని ప్రతి జిల్లా నుంచి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎంతోమంది నివాసులై జీవనం సాగిస్తుండడంతో మేయర్, డిప్యూటీ మేయర్ చర్చ ఉ బందుకుంటుంది.

కార్పొరేషన్ మేయర్ రిజర్వేషన్ నుంచి మేయర్ రిజర్వేషన్ ఎవరికి వస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానం లభించకపోవడంతో నాటి నుంచి మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఉత్కంఠకు దారితీస్తుంది. బీసీ మహిళ కు మేయర్ రిజర్వేషన్ రావడంతో బిసి మహిళలుగా గెలిచిన కార్పొరేటర్లు మాకే మేయర్ పదవి కావాలి అంటే మాకు కావాలనే ప్రయత్నాలకు నేడు ము గింపు కార్డు పలకనున్నది. 60 డివిజన్లో ఉన్నప్పటికీ 29 డివిజన్ లలో కాంగ్రెస్ పార్టీ విజయతీరాలకు చేరిన విషయం విధితమే. మరో నలుగురు స్వతంత్ర అభ్యర్థులను పార్టీ కి లోకి ఆహ్వానించి అందరూ ఇతర ప్రాంతానికి ఫలితాలు వచ్చిన నాడే ప్రయాణ మయ్యారు.

చర్చలు,ఉప చర్చలు బుజ్జగింపులు, సంప్రదింపులు, సలహాలు సూచనలు అన్ని సమపాలలో అందరిని మెప్పించుకొని తమదైన శైలిలో అధిష్టానం సూచనలు పాటి స్తూ ఆ బీసీ మహిళ మేయర్ ను ఖరారు చేసేందుకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తనదైన శైలిలో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. గెలిచిన కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇతర ప్రాంతంలో ఉండడంతో ఆ బస్సుల్లో ప్రత్యేకంగా నేరుగా మున్సిపల్ కార్పొరేషన్ కు వస్తాయని తెలుస్తుంది. ఈ ప్రయత్నాలన్నిటికీ నేటితో ముగింపు పలకడంతో ఈ చర్చ ఒక్కసారిగా పట్టణంలో ఊపందుకుంది.

డిప్యూటీ మేయర్ కీలకమే...

మేయర్ బాధ్యతకు రిజర్వేషన్ ఉన్నప్పటికీ డిప్యూటీ మేయర్ అన్ని సామాజిక వర్గాలలో ఎవరైనా బాధ్యతలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ ఇటు పరిపాలనను అటు పార్టీని క్యాడర్ ను పక్క ప్రణాళికలతో ముందుకు అడుగులు వేపించే నాయకులకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందా? సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకొని అందరికీ న్యాయం చేయాలని లక్ష్యంతో అడుగులు పడతాయా? అనే ప్రశ్నలకు నేడు సమాధానం లభించనున్నది. దీంతో ఉ మ్మడి జిల్లాలోని కీలకంగా ఉన్న పాలమూ రు జిల్లా వైపు ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండ్రు. 

పాలమూరు జిల్లాకు పవర్ ఎక్కువ..

మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలోని నూడల్ జిల్లా కావడంతో ఈ జిల్లాకు కొంత పవర్ ఎక్కువగానే ఉంటుందని ప్రజ లు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్న మాట. పాలమూరు జిల్లా కేంద్రంలో మనవారు ఉంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎటువైపైన ఎలాంటి పనులు ఉన్న కొంతలో కొంతైనా జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయని సంబంధాలు కూడా మరింత పదిలంగా ఉంటాయని నాయకులే ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారంటే ఈ జిల్లా కేంద్రంపై ఉన్న పోటీ ఏ మేరకు ఉంటుందో ఒక్కసారి ఆలోచించాల్సిందే. ఈ సందేహాలకు సమాధానం నేడు లభించడంతో మున్సిపల్ ప్రక్రియ పూర్తిస్థాయిలో ముగింపు పలకనున్నది.