calender_icon.png 26 May, 2025 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్య సహకార సంఘం అభివృద్ధికి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి

25-05-2025 07:49:38 PM

బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్..

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): మత్స్య సహకార సంఘం అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్(MLA KP Vivekanand) తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132-జీడిమెట్ల డివిజన్ వెన్నెల గడ్డలోని ఎఫ్సిఎస్ కన్వెన్షన్ నందు నిర్వహించిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం, జీడిమెట్ల శాఖ 5వ సర్వసభ్య సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో చెరువులకు జీవం పోస్తూ మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఆర్థికాభివృద్ధిని అందించి, మత్స్య పారిశ్రామిక అభివృద్ధికి కృషిచేసిన గొప్ప నాయకుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్(BRS Party leader KCR) అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఫిషరీస్ కో-అపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్ సుకీర్తి, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జీడిమెట్ల శాఖ అధ్యక్షులు చిలుకూరి కృష్ణ, ఉపాధ్యక్షురాలు చిలుకూరి యాదమ్మ, ప్రధాన కార్యదర్శి మద్దూరి వీరేష్, డైరెక్టర్లు తాళ్ల వెంకటేష్, మన్నె శంకర్, అరికల లక్ష్మణ్, మద్దూరి సత్తెమ్మ, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.