calender_icon.png 25 May, 2025 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రజతోత్సవ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

25-05-2025 07:53:19 PM

హనుమకొండ (విజయక్రాంతి): కరీమాబాద్ బొమ్మల గుడి జంక్షన్ లోని సరస్వతి ఉన్నత పాఠశాల(Saraswathi High School)లో 1999- 2000 పదవ తరగతి చదువుకున్న విద్యార్థిని విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యా పాఠాలు నేర్పిన గురువులు ప్రభాకర్ రెడ్డి, అశోక్, ప్రీతి, సుగుణ, ఉప్పలయ్య, మధుసూదన్, లక్ష్మీ, స్వరూప రాణి, శివ నాగ కుమార్, సుభాష్ లను  ఘనంగా సన్మానించారు. 25 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్ర బృందం ఎంతో ఆనందంగా ఆత్మీయంగా అందరినీ పలకరించుకొని ఆటపాటలతో ఆనందంగా గడిపారు.

పాఠశాల అభివృద్ధికి మా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు  వీణవంక కిరణ్ కుమార్, రవ్వల ప్రభాకర్, శ్రీపాద శ్యాంసుందర్, డి కవిత, పి కౌసల్య, కృష్ణవేణి, వి స్వప్న, ప్రవీణ్, శ్రీలత, కే విజయలక్ష్మి, రాజేష్, సురేష్, నాగరాజు, రత్నాకర్, రామకృష్ణ, డి స్వప్న, స్వప్న కుమారి, స్వాతి, అనిల్, సంతోష్, శివయ్య, పద్మ, వాసవి, స్వాతి, శ్రీనివాస్ నవత, టి రజిత, టి స్వప్న, శ్రీదేవి, రజిని నాగమణి, సుజాత, సుమలత, సమతా భావన, స్కూలు అటెండర్ పారిజాతం తదితరులు పాల్గొన్నారు.