28-01-2025 01:18:25 AM
మహూ, జనవరి 27: భారత రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ పుట్టిన గడ్డ అయిన మధ్యప్రదేశ్‌లోని మహూలో కాంగ్రెస్ “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” ర్యాలీ ము గింపు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటుగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు.
రాజ్యాంగ రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ దేశంలోని అనేక ప్రాంతాల్లో “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” ర్యాలీలు నిర్వహించింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్త కులగణను చేపడతాం. ప్రధానిగా ఉన్న మో దీ ఎప్పటికీ ఇది చేయలేరు.
మేము అధికారంలోకి వచ్చిన తెలంగాణలో కులగణన సర్వేను విజయవంతంగా పూర్తి చేశాం. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని కాంగ్రెస్ తొలగిస్తుంది. జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేయాలి. కేంద్రంలో ఉన్న బీజేపీ బిలియనీర్ల కోసం పని చేస్తుంది. విద్యావ్యవస్థను మార్చేందుకు కుట్రలు చేస్తున్నారు.
దేశంలో 90 శాతం మందికి చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కడం లేదు. రిజర్వేషన్లలో ఓబీసీలకు అన్యాయం జరుగు తోంది. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే దళితులు, గిరిజనులు, పేదవారు మరోసారి బానిసలుగా మారే ప్రమాదం ఉంది. ఉద్యోగావకాశాలు అనేవి లేవు. జీఎస్టీ పేరుతో ప్రజలను లూఠీ చేస్తున్నారు.
దేశం మొత్తం కొంత మంది సంపన్నుల చేతుల్లోకి వెళ్లిపోయింది. బీజేపీ కలిసి స్వాతం త్య్రానికి ముందు పరిస్థితులు తీసుకొచ్చా యి. పేదవారికి హక్కులు అనేవే లేకుండా చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నాయి.
అందుకోసమే పోయిన లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు అనే నినాదం ఇచ్చారు. మన దేశ రాజ్యాంగాన్ని మార్చిన రోజు దేశంలోని దళితులు, వెనుకబడిన వర్గాలకు ఏమీ మిగలదు’ అని రాహుల్ గాంధీ అన్నారు.
రాజ్యాంగ రక్షణ కోసమే ర్యాలీ: ఖర్గే
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మా ట్లాడుతూ.. ‘ఈ రోజు రాజ్యాంగ రక్షణ ఎం తో అవసరం. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యా న్ని రక్షించేందుకే కాంగ్రెస్ ఇంత పెద్ద ర్యాలీని చేపట్టింది. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే కోరిక మీకు లేదా? ఎవరు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారో మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
అంబేద్కర్ దళితులు, వెనుకబడిన వ ర్గాల హక్కుల కోసం పోరాడారు. గాంధీ, నెహ్రూ వంటి నేతలను స్ఫూర్తిగా తీసుకుని పోరాడాలి’ అని పిలుపునిచ్చారు. సమావేశ ంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలు తదితరులు పాల్గొన్నారు.
గంగలో మునిగితే..
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మహాకుంభమేళా గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మహూలో జరిగిన “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” సభలో ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీ నేతలు మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నా రు. గంగలో మునిగితే దేశంలోని పేదరికం తొలిగిపోతుందా? ఆకలితో ఉన్నవారి కడుపు లు నిండుతాయా?’ అని ప్రశ్నించారు. ఎవరైనా తన వ్యాఖ్యలను తప్పుగా భావిస్తే క్షమించాలని కోరారు.
బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఖర్గే వ్యాఖ్యలను తప్పుబట్టారు. సనాతన ధర్మం మీద దాడిగా అభివర్ణించారు. వేరే మతం గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ మాలవీయ స్పందిస్తూ.. ‘ఈ మాటలు ఆయనవి కాదు. అసలు కాంగ్రెస్‌కు హిందువులంటే ఎందుకంత ద్వేషం. ప్రజల నమ్మకాలను కాంగ్రెస్ అవమానిస్తోంది’. అని అన్నారు.