calender_icon.png 11 November, 2025 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం

28-01-2025 01:36:45 AM

న్యూఢిల్లీ, జనవరి 27: వక్ఫ్ సవరణ బిల్లుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పలు ప్రతిపాదనలతో ఆమోదం తెలిపింది. ఈనెల 31న తుది నివేదిక లోక్‌సభకు అందజేయనున్నట్లు సంబంధిత వర్గాల స మాచారం. రానున్న బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించే అవకాశా లు కనపడుతున్నాయి.

మొత్తంగా 44 సవరణలు సూచించగా..14 సవరణలను మాత్ర మే కమిటీ ఆమోదించినట్లు జేపీసీ చైర్మన్ జగదాంబిక పాల్ వెల్లడించారు. ఎన్డీయే సభ్యులు సూచించిన మార్పులకు మాత్రమే ఆమోదం లభించిందని ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. 31న తుది నివేదికను లోక్‌సభకు అందజేయనున్నారు.