calender_icon.png 11 November, 2025 | 10:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే దేశం.. ఒకే సమయం

28-01-2025 12:50:15 AM

ముసాయిదా నిబంధనలు విడుదల

న్యూఢిల్లీ, జనవరి 27: దేశవ్యాప్తంగా ఒకే సమయాన్ని ప్రామణీకరించే చర్యలో భాగంగా .. ఇక అన్ని రంగాల్లో భారత ప్రామాణిక సమయం(ఐఎస్‌టీ) వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ముసాయిదా నిబంధనలు రూపొందించింది. వీటిపై వచ్చే ఫిబ్రవరి 14లోపు ప్రజలు అభిప్రాయాలు చెప్పాల్సి ఉంటుంది.

ఇందుకోసం తూనికలు కొలతలు (భారత ప్రామాణిక సమయం) నిబంధనలు, 2024లో చట్టపరమైన విధివిధానాలు ఏర్పాటు చేశారు. ఇవి అమల్లోకి వస్తే చట్ట, పాలన, వాణిజ్య, ఆర్థిక రంగాలు, అధికారిక పత్రాల్లోనూ ఐఎస్‌టీ తప్పనిసరి కానుంది. ఈ చట్టంలోని ముసాయిదా నిబంధనల ప్రకారం.. ఐఎస్‌టీ కాకుండా ఇతర టైమ్ జోన్లను ప్రస్తావించడం నిషేధం. కాగా సముద్రయానం, శాస్త్రీయ పరిశోధన రంగాలకు మినహాయింపునిచ్చారు.