4 July, 2026 | 11:17 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

వాళ్లు దర్యాప్తు బృందంలో భాగమే

01-09-2024 12:55 AM
  1. జూడా హత్యాచారం సంఘటనా స్థలంలో.. 
  2. వైరల్ అయిన వీడియోలపై పోలీసుల క్లారిటీ

కోల్‌కతా, ఆగస్టు 31:  కోల్‌కతా వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్య కేసులో రోజుకో విషయం వెలుగు చూస్తోంది. హత్య జరిగిన తర్వాత సెమినార్‌హాల్‌లోని సంఘటనా స్థలం వద్ద చాలా మంది ఆసుపత్రికి చెందని వ్యక్తులు ఉన్నట్లు రెండు వీడియోలు వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించి కోల్‌కతా పోలీసులు వివరణ ఇచ్చారు. ఆ వీడియోల్లో కనిపించిన వ్యక్తులు ప్రత్యక్షంగా దర్యాప్తులో పాల్గొన్నవారేనని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి రెండు ఫొటోలను పోలీసు విభాగం విడుదల చేసింది. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరిన వెంటనే ఉదయం 10.30 గంటలకు ఆ ప్రదేశాన్ని మూసివేసినట్లు తెలిపారు. ఆధారాలను చెరిపేసేందుకు ఎలాంటి అవకాశం లేకుండా చేశామని స్పష్టంచేశారు. ఫొటోల్లో ఎవరెవరు ఏ విధుల మీద సంఘటనా స్థలంలో ఉన్నారో పోలీసులు వివరించారు.