4 July, 2026 | 9:47 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

భారత్ ఆ తప్పు చేయదు

01-09-2024 12:57 AM
  1. హసీనా అప్పగింతకు అంగీకరిస్తుంది 
  2. కాకపోతే ఇండియాకు కొద్దిగా ఇబ్బంది తప్పదు 
  3. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సలహాదారు హుస్సేన్

న్యూఢిల్లీ, ఆగస్టు 31: భవిష్యత్తులో మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని హోంమంత్రిత్వ శాఖ లేదా న్యాయశాఖ అభ్యర్థన చేస్తే, అందుకు అనుగుణంగా భారత్ కట్టుబడి ఉంటుందని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహిద్ హుస్సేన్ పేర్కొన్నారు. ఈ విషయంపై మాట్లాడేందుకు తాను తగిన వ్యక్తి కానప్పటికీ అలాంటి ప్రస్తావన వస్తే అది భారత ప్రభుత్వానికి అసౌకర్య పరిస్థితిని సృష్టించే అవకాశముందని హుస్సేన్ పేర్కొన్నారు. హసీనా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ట్లు తెలుస్తోంది. ఇక్కడి ప్రభుత్వం ఆమెను తీసుకురావాలని భావిస్తే భారత్‌ను అడగాల్సి ఉంటుంది. అప్పుడు ఈ విషయంలో భారత్ ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ.

కానీ భారత్ ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుందని నేను నమ్ముతున్నా అని హుస్సేన్ తెలిపారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య హసీనా అప్పగింత అంశం కీలకపాత్ర పోషిస్తుందని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. తమ జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ అన్ని దేశాలతో సఖ్యతను కొనసాగించడమే తమ ప్రభుత్వ విధానమని వివరించారు. త్వరలోనే దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశముందని, వాటిని నిష్పక్షపాతంగా నిర్వహించడమే ప్రస్తుతం తమ ముందున్న ప్రాథమిక లక్ష్యమని పేర్కొన్నారు. హసీనా ప్రస్తుతం 42 హత్యానేరాలతో పాటు మొత్తం 51 కేసులను ఎదుర్కొంటున్నారు.