23-02-2026 12:53:17 AM
కేంద్ర మంత్రి భూపతి వర్మ
తాండూరు, ఫిబ్రవరి 22, (విజయ క్రాంతి): నేటితరం విద్యార్థులకు భారత సాంస్కృతి, సాంప్రదాయాలతో కూడిన విద్య అవసరమని కేంద్ర మంత్రి భూపతి రాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు. ఆదివారం ఆయన రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి , ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తో కలిసి తాండూరు మండలం జీనుగుర్తి ఏకలవ్య గ్రామీణ్ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాందీపని గురుకులం ఆవరణలో పలు భవనాలను ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్బంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతం అయిన జిన్ గుర్తి లో ఏకలవ్య గ్రామీణ్ వికాస్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. విద్యను వ్యాపారం చేయకూడదనే ఉద్దేశ్యంతో కొనసాగుతున్న ఏకలవ్య ఫౌండేషన్ కు ఎల్లప్పుడూ తమ వంతు సహాకారం ఉంటుందని.. అందుకుగాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్ని నిధులు ఖర్చయినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
ధీర్ఘకాలిక లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్ అతి తక్కువ సమయంలోనే భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతల నుండి ప్రముఖ ప్రాంతాలను ఒకే వేదిక పైకి తెచ్చిందని అన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం నుండి దేశానికి నాయకత్వం వహించే ఎంతో మంది నాయకులను, ఐఏఎస్ లను, శాస్త్రవేత్తలను, డాక్టర్స్ ను, లాయర్లను, అధికారులను ఎంతో మంది ప్రముఖులు ఈ ప్రాంతం నుండి దేశానికి ఫౌండేషన్ అందించబోతుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏకలవ్య ఫౌండేషన్ బాధ్యులు భాగయ్య, తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ నీరజ ,పలువురు ప్రముఖులు, అధికారులు, ఏకలవ్య ఫౌండేషన్ విద్యార్థులు పాల్గొన్నారు.