సైగలతోనే సమస్య వివరించారు
28-09-2026 | 07:47pm
నిర్మల్ సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District)లో చెవిటి మూగ అంగవైకల్యం ఉన్న బాధితులు బ్యాక్ లాక్ పోస్టులు అవకాశం కల్పించాలని సైగలతో మృతి పత్రం అందించారు. జిల్లా అధ్యక్షులు సాయినాథ్, ప్రధాన కార్యదర్శి నరసింహస్వామి ఆధ్వర్యంలో చెవిటి మూగ నిరుద్యోగులు తెల్ల పేపర్ పై కాగితం రాసి సైగలతో జిల్లా అధికారులకు తమ సమస్యలు వివరించారు. ఏళ్ల తరబడి ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వేయకపోవడంతో తాము నిరుద్యోగ మారుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఆ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు.