30 June, 2026 | 9:43 PM

Breaking News

రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •  

పట్టుదలతో చదివితే రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు

06-05-2026 12:34 PM

ఘట్‌కేసర్,(విజయక్రాంతి) : పట్టుదల, క్రమశిక్షణతో చదివితే రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధ్యమవుతుందని ఘట్ కేసర్ ప్రెస్ క్లబ్(Ghatkesar Press Club) అధ్యక్షుడు లింగాల భూపాల్ అన్నారు. ఘట్‌కేసర్ పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని యామిని 10వ తరగతి ఫలితాలలో విశిష్ట ప్రతిభ కనబరిచి 576 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలవడంతో పాటు జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించింది. ఈ సందర్భంగా ఘట్‌కేసర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో యామిని‌ను ఘనంగా సన్మానించారు.

ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు లింగాల భూపాల్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యామిని‌కు రూ. 3,100 నగదు బహుమానం అందజేయడంతో పాటు ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు, భారత రాజ్యాంగం పుస్తకాన్ని బహుమతిగా అందించారు. ఆమె కృషి, పట్టుదల అభినందనీయం అని కొనియాడుతూ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి యామిని‌ను ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించడం సాధ్యమే అని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా పట్టుదలతో శ్రమిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచగలరని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మండల విద్యాధికారి రాములు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ, విద్యార్థిని తల్లిదండ్రులు, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు కే. యాదగిరి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి ఎస్. నర్సింగ్ రావు, కోశాధికారి యల్. రాజు, సలహాదారులు ఎఫ్. రామకృష్ణ, వి. గోవింద్,  సభ్యులు పాల్గొన్నారు.