30 June, 2026 | 10:34 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

అదుపుతప్పి ఆటో బోల్తా.. ముగ్గురికి తీవ్రగాయాలు

06-05-2026 12:32 PM

ఇల్లందు,(విజయక్రాంతి): శెట్టిపల్లి నుంచి ఇల్లందు వైపు ప్రయాణికులతో వస్తున్న ఆటో బుధవారం ఉదయం ప్రమాదకరమైన మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడటంతో లలిత, లక్ష్మీకాంత్, నాగేంద్ర తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంతో వస్తున్న ఆటోను డ్రైవర్ నియంత్రించలేకపోవడంతో ఒక్కసారిగా పల్టీలు కొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన వారు వెంటనే స్పందించి బాధితులను బయటకు తీసి ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా, గాయాలు తీవ్రంగా ఉండటంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.