కోహ్లీని తిట్టమని డబ్బులు ఆఫర్ చేశారు
జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ సంచలన వ్యాఖ్యలు
ముంబై, మే 12: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్ లాజ్ ఇన్‌స్టా ఫోటోకు కోహ్లీ లైక్ కొట్టడం అప్పట్లో చాలా వైరల్ అయింది. ఆ విషయంపై లిజ్‌లాజ్ తాజాగా హాట్ కామెంట్స్ చేసింది. విరాట్‌పై తప్పుడు ఆరోపణలు చేయాలని కొందరు జర్నలిస్టులు తన వద్దకు వచ్చారనీ, అందుకు డబ్బు కూడా ఆఫర్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేసింది.
విరాట్ కోహ్లీ తన ఫోటోకు లైక్ కొట్టడంతో అనూహ్యంగా తాను సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాననీ, ఆ ఘటన అనంతరం పలువురు జర్నలి స్టులు తన దగ్గరికి వచ్చి.. కోహ్లీ గురించి చెడుగా మాట్లాడా లని చెప్పారని పేర్కొంది. అతడు చేయని పనులపై కూడా ఆరోపణలు చేయాలని తనను కోరారనీ సంచలన విషయాలు వెల్లడించింది. విరాట్ తనకు డైరెక్ట్‌గా మెసేజ్ చేస్తున్నట్లు చెప్పమన్నారనీ, దానికి పెద్ద ఎత్తున డబ్బు కూడా ఆఫర్ చేశారని పేర్కొంది.
కానీ తాను అలా ఎందుకు చేస్తాననీ, విరాట్ అంటే తనకు పిచ్చి అని చెప్పింది. డబ్బు లేదా పాపులారిటీ కోసం అతడి ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని లిజ్‌లాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీనికి సంబం ధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జర్మనీకి చెంది న ఆమెకు డచ్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ భాషలపై మంచి పట్టు ఉంది. సైకాలజీలో ఎంఎస్సీ కంప్లీట్ చేసిన లిజ్‌లాజ్ సర్టిఫైడ్ లైఫ్ సేవింగ్ స్విమ్మర్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది.






