13 August, 2026 | 8:22 PM

అక్రమంగా తరలిస్తున్న 7 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం స్వాధీనం.

13-08-2026 05:39 PM

మహాదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మీదగా అక్రమంగా తరలిస్తున్న ఏడు క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని మహాదేవపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాటారం వైపు నుంచి వస్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా 14 బస్తాలలో బియ్యం గుర్తించారు. ఈ ఘటనలో బొమ్మ గణపతి, హనుమల గణపతి ని అదుపులోకి తీసుకొని బియ్యంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ 24,500 గా పోలీసులు తెలిపారు. పిడిఎస్ బియ్యం  అక్రమ నిలువలు, అక్రమ రవాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.