సీఐటీయు ఆధ్వర్యంలో ఘనంగా ఫైడల్ కాస్ట్రో శతజయంతి
దమ్మపేట,(విజయక్రాంతి): ఫైడల్ కాస్ట్రో శతజయంతి సందర్భంగా గురువారం సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో కాస్ట్రో కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు మాట్లాడుతూ... క్యూబా దేశంలో ఆకలి అసమానతలకు, నిరంకశత్వ పాలనకు వ్యతిరేకంగా అగ్రదేశం అమెరికా పెత్తనాన్ని ఎదిరించి ఎర్రజెండా విప్లవం క్యూబా దేశంలో తీసుకురావడంలో అశేషమైన త్యాగాలు చేసిన మహోన్నత నేత కాస్ట్రో అని అన్నారు.
ప్రపంచంలో ఎక్కడ విపత్తులు జరిగిన అక్కడికి క్యూబా వైద్యులను సహాయక సిబ్బందిని పంపించి ప్రజలకు సేవలు అందించడంలో ఏ సామ్రాజ్యవాదం దేశం చేయలేని మానవాత సేవలందించి స్పూర్తి గా నిలిచిందని అన్నారు. సోషలిస్ట్ ప్రత్యామ్నాయం కోసం పోరాడటమే కాస్ట్రో శతజయంతి సందర్బంగా మహనీయుడు కాస్ట్రొ కు మనమిచ్చే నిజమైన నివాళిఅని అన్నారు. ఈ కార్యక్రమం లో విజయలక్ష్మి, యశోధ, నర్సమ్మ, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.






