సమర్థంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారు
- అక్రమ మైనింగ్‌పై కఠినంగా వ్యవహరించకపోతే కలెక్టర్, ఎస్పీని సస్పెండ్ చేస్తాం
నెలకు 10 రోజులైనా క్షేత్ర స్థాయిలో పర్యటించాలి
కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి) : ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులే.. కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచే యాలి. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఐఏఎస్ ఉద్యోగానికి సార్థకత ఉంటుంది . క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారు. కలెక్టర్లుగా క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ఎప్పటికీ మీకు ప్రజల సమస్యలు అర్థం కావు.
కనీసం నెలకు 10 రోజులైనా క్షేత్ర స్థాయిలో పర్యటించాలి. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలి ’ అని సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ‘ఇసుక మాఫి యా, అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించకపోతే కలెక్టర్, ఎస్పీని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. మిల్లర్ల దగ్గర నుంచి ధాన్యా న్ని వెనక్కి రాబట్టుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదే.
మోసాలకు పాల్పడే మిల్లర్ల పట్ల కలె క్టర్లు కఠినంగా వ్యవహరించాల్సిందే. వైద్యం పై ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తోంది. భవిష్యత్‌లో అన్ని మెడికల్ కాలేజీలతో ప్రభుత్వ హాస్పిటల్స్‌ను ఇంటిగ్రేట్ చేయాలని భావిస్తున్నాం.పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రణాళికలు రూపొంది స్తున్నాం. బోగస్ ఉద్యోగులను సృష్టించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అని సీఎం సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పౌష్టికారం
‘రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయి. ప్రతీ పాఠశాలలో మధ్యాహ్న భో జనం కోసం ఒక అధికారికి బాధ్యత ఇవ్వాలి. ఆ అధికారి విద్యార్థులతో పాటు పాఠశాలలో భోజనం చేయాల్సిందే. కలెక్టర్లు వారా నికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యా హ్న భోజనం చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అం దించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం.
వంద నియోజకవర్గాల్లో... ఒక నియోజకవర్గానికి ఒక మండల కేంద్రంలో నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నాం.ఆరుట్ల తరహాలో అన్ని రకాల వసతులతో ఈ పాఠశాలలను ఏర్పాటు చేయబోతున్నాం.ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు నివేదిక అందించాలి ’ అని సీఎం తెలిపారు.




