06-12-2025 10:51:41 PM
మసాయిపెట్ /చేగుంట (విజయక్రాంతి): మాసాయిపేట గ్రామములోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రము, దాని సమీపంలో గల మణికంఠ కిరాణా షాపు వెంకటరమణ కిరాణా షాపులో నిన్న అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తుతెలియని దొంగలు దుకాణతలుపులు పగలగొట్టి కౌంటర్లో గల నగదు 20,000 వెల రూపాయలు దొంగలించారు. ఈ విషయములో ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం యజమాని బుడ్డ మహేష్ తండ్రి లచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు చేగుంట ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు.