4 April, 2026 | 3:04 AM

ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

04-04-2026 01:16 AM

మంగపేట, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): గుడ్ ఫ్రై డే వేడుకలను మంగపేట మండల వ్యాప్తంగా క్రైస్తవ మత గురువులు, సంఘ సభ్యులు శుక్రవారం ఘ నంగా జరుపుకున్నారు. మండలంలోని ఆ యా చర్చిల మత గురువులు, అనూయు లు, సంఘ సభ్యులు ఆయా గ్రామాలలోని చర్చిలలో క్రీస్తు పాఠాలు చదువుతూ ఏసుక్రీస్తును స్మరిస్తూ, ప్రార్ధనలు చేశారు. రాజుపేట గ్రామంలో పునీత ఫ్రాన్సిస్ జేవియార్ చర్చి ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు.

రాజుపేట గ్రామంలో పునీత ఫ్రాన్సిస్ జేవియార్ చర్చి ఆధ్వర్యంలో నిర్వహించిన గుడ్ ఫ్రైడే వేడుకలలో ఏసుక్రీస్తును చిత్రహింసకు గురి చేస్తూ ఎలా శిలువ వేశారో కళ్ళకు కట్టినట్లు చర్చి బృందం దృశ్య రూపకంగా ఊరేగింపులో ప్రదర్శించారు. మండల వ్యాప్తంగా జరిగిన గుడ్ ఫ్రైడే వేడుకలలో భాగంగా ఆయా చర్చిలలో చర్చి పాస్టర్లు, సంఘ పెద్దలు గుడ్ ఫ్రైడే శాంతి సందేశం, ప్రభువు యొక్క త్యాగం గురించి సంఘ సభ్యులకు వివరించారు. ఆరాధన ప్రార్ధనలు నిర్వహించారు. రాష్ట్రంలో, దేశంలో శాంతి వర్ధిల్లాలని దైవజనులు తమ సందేశాలను అందించారు.