ఏజెన్సీలో దాహం.. దాహం
- మిషన్ భగీరథ నీటి సరఫరాలో నిత్యం అంతరాయం
- తాగునీటి కోసం నేటికీ కిలోమీటర్ల దూరం కాలినడక
- పైప్‌ల లీకేజీలతో తరచూ మురుగునీరు సరఫరా
- నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
ఉట్నూర్, మార్చి 25 (విజయక్రాంతి) : వేసవికాలంలో గిరిజనులకు దాహార్తి తిప్పలు తప్పడం లేదు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, అదిలా బాద్ రూరల్, గాదిగూడ మండలాల పరిధిలోని మారుమూల గ్రామాల గిరిజనులు తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి నేటికీ తప్పడం లేదు. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు ఎప్పుడు అందుతోందో తెలియని పరిస్థితి నెలకొంది.
మిషన్ భగీరథ పైప్ లైన్లు లీకేజీ అవుతున్న ఆ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గిరిజనులకు సకాలంలో తాగునీరు అందక వాగుల వద్దకు, బావులు, వ్యవసాయ భావి ల వద్దకు పరుగులు తీయవలసిన పరిస్థితి నెలకొంది.
తాగునీటి సమస్య పరిష్కరిం చాలంటూ అధికారుల దృష్టికి తీసుకు వెళుతు న్న పరిష్కరించడం లేదని గిరిజనులు వాపోతున్నారు. వేసవి ఎండలు తీవ్రమవుతుండ డంతో తాగునీటి కోసం పరుగులు తీయాల్సి న పరిస్థితి ఉందని గిరిజనులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారు లు మారుమూల పల్లెల ను క్షేత్రస్థాయిలో పరిశీలించి తాగునీటి సమస్యను గుర్తించి పరిష్కారం చేయాలని గిరిజ నులు కోరుతున్నారు.
భగీరథ పైప్‌లైన్లలకు లీకేజీలు...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు తీసుకువచ్చి న మిషన్ భగీరథ పథకంలో ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌లు లీకేజీ అవుతున్నాయి. లీకేజీ అయి న పైపులకు మరమ్మత్తు చేయకపోవడంతో మురికి నీరు సైతం గ్రామాలకు సరఫరా అవుతుంది. వారం, పరీక్ష రోజులకు ఒకసారి వచ్చి మిషన్ భగీరథ నీరుని కొన్ని గ్రామాల ప్రజలు బురదతో ఉన్న నీటిని తాగేందుకు ఇష్టపడడం లేదు. పాత బావులు, వ్యవసాయ బావులలోని నీటిని ఎడ్లబండ్లతో తీసుకువస్తున్నారు.
పని చేయని సోలార్ ట్యాంకులు
ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని తాగునీటి సమస్య ఉన్న గిరిజనుల గ్రామాలను గుర్తించి ఐటీడీఏ నిధులతో సోలార్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. రెండేళ్ల వరకు సోలార్ ట్యాం కులు సక్రమంగా పనిచేసి, గిరిజనుల గొంతు తడిపాయి. కానీ గత ప్రభుత్వం తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకంతో సోలార్ ట్యాంకుల వైపు అధికారులు కన్నెత్తి చూడలేక పోవడంతో ఆ ట్యాంకులు గ్రామాల్లో నిరుపయోగంగానే దర్శనమిస్తున్నాయి.
25 గ్రామాలను గుర్తించాం..
ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూ ర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాల్లో 25 గ్రామాలను తాగునీటి ఎద్దడి గ్రామాలుగా గుర్తించాం. ఆ గ్రామాల్లో ప్రత్యేకంగా తాగునీటి ఇబ్బంది తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మిగ తా గ్రామాల్లో సైతం తాగునీటి ఎద్దడి రాకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నాం. మిషన్ భగీరథ పైప్ లైన్లను లీకేజీ కాకుం డా చర్యలు తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేస్తున్నాం.
శ్రీనివాస్, డిప్యూటీ ఈ.ఈ
ఆర్డబ్ల్యూఎస్, ఉట్నూర్
బావి నీరే దిక్కు..
తమ గూడానికి బావి నీరే దిక్కు. గూడెంలో బోరు వేసి, సోలార్ ట్యాంక్ ఏర్పాటు చేసి న అది పని చేయడం లేదు. మిషన్ భగీరథ నీరు ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చినా.. బురదగా వస్తున్నా యి. అధికారులు పలుమార్లు చెప్పిన వారు పట్టించు కోవడం లేదు. వేసవిలో భగీరథ నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి.
మడవి మహదు, పోతాగూడ,
ఆదిలాబాద్ రూరల్ మండలం.
వారంకు ఒకసారి నీరు వస్తుంది
వారానికి ఒకసారి మిషన్ భగీ రథ నీరు వస్తుంది. భగీరథ నీరు రాకుంటే గ్రామాని కి దూరంగా ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లి తాగునీరు తీసుకువస్తున్నాం. సమాకా పంచాయతీ శివారులోని చేనులో బోరు వేసి పైప్లైన్ ద్వా రా నీరు సరఫరా విద్యుత్ అంతరాయంతో నీరు సక్రమంగా రావడం లేదు.
కొడప లక్ష్మణ్ పటేల్, పాట గూడ,
ఇంద్రవెల్లి మండలం.




