11 April, 2026 | 3:30 PM

Breaking News

ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •   నాకు నమ్మకం ఉంది.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్   •   నిర్మల్‌లో నిరసన తెలుపుతున్న నాయకులు   •   అతిధి అధ్యాపకుల సర్వీసును 2026-27 విద్యా సంవత్సరానికి కొనసాగించాలి   •  

జ్వలించే ఈ మట్టి చైతన్యమే స్ఫూర్తి

08-12-2024 01:58 AM
  1. విరామమెరుగక.. విశ్రాంతి కోరక.. ముందుకు  
  2. ‘ఎక్స్’లో సీఎం రేవంత్‌రెడ్డి భావోద్వేగ పోస్టు 

హైదరాబాద్, డిసెంబర్ 7(విజయక్రాం తి): కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తయిన సం దర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా భా వోద్వేగ పోస్టు చేశారు. పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలు, ఆత్మబలిదానాలు, ఆకాం క్షలు, ఆశయాలన్నింటినీ కలిపి వీలునామా గా రాసి డిసెంబర్ 7, 2023న తెలంగాణ తన చేతుల్లో పెట్టింద ని పేర్కొన్నారు.

వారసత్వాన్ని సగర్వంగా, సమున్నతంగా ముం దుకు తీసుకువెళ్లే బాధ్యతను రాష్ట్రం అప్పగించిందని తెలిపా రు. ‘ఆ క్షణం నుంచి జనసేవకుడి గా, ప్రజాసంక్షేమ శ్రామికుడిగా, మదిలో, విధిలో, నిర్ణయాల జడిలో సకల జనహిత మే పరమావధిగా, జాతి ఆత్మగౌరవమే ప్రా ధాన్యంగా, సహచరుల సహకారం, జనహితుల ప్రోత్సాహంతో విమర్శలను సహిస్తూ విద్వేషాలను ఎదిరిస్తూ స్వే చ్ఛకు రెక్కలు తొడిగి ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ పరిచి అవనిపై అగ్ర భాగాన తెలంగాణను నిలిపేందు కు గొప్ప లక్ష్యాల వైపు నడుస్తూ నాలుగు కోట్ల ఆశయాలను నడిపిస్తూ నిరంతరం జ్వలించే ఈ మట్టి చైతన్యమే స్ఫూర్తిగా విరామం ఎరుగక విశ్రాంతి కోరక ముందుకు సాగుతున్నాను. ఏడాది  పాలనలో ఎంతో సంతృప్తి. సమస్త ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేర్చడమే నా సంప్రాప్తి’ అని పేర్కొన్నారు.