27-01-2026 01:03:21 AM
రిపబ్లిక్ డే సందర్భంగా టాలీవుడ్ ఆనందంతో వెలిగింది. తెలు గు రాష్ట్రాల నుంచి ఐదుగురు ప్రముఖులతోపాటు సీనియర్ నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్లు పద్మశ్రీ అవార్డులకు ఎంపిక కా వడం సినీ పరిశ్రమకు విశేష గౌరవంగా నిలిచింది. ఈ సంద ర్భంగా అగ్ర నటు డు చిరంజీవి స్వయంగా మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్ల నివాసాలకు వెళ్లి వారిని శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.
తెలుగు సినిమాకు లభించిన ఈ జాతీయ గౌరవం ఒక మైలురాయిగా పేర్కొన్నారు మెగాస్టార్. 2006లో పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి.. ఇది చిత్ర పరిశ్రమకు నిజంగా ఒక ఆనందకరమైన రోజు అని అభివర్ణించారు. ఇదే సందర్భంలో సోషల్ మీడియా ద్వారా కూడా చిరంజీవి పద్మ అవార్డు పొందినవారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మమ్ముట్టీ, మాధవన్తోపాటు క్రీడారంగం నుంచి రోహిత్ శర్మ, వరల్డ్కప్ విజేత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, డాక్టర్ దత్తాత్రేయుడు నోరికి అభినందనలు తెలియజేశారు.