calender_icon.png 28 January, 2026 | 10:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రవితేజ.. ఇరుముడి

27-01-2026 01:04:59 AM

రవితేజ తన 77వ చిత్రం కోసం దర్శకుడు శివ నిర్వాణతో జతకట్టారు. ఈ చిత్రా న్ని మైత్రి మూవీ మేక ర్స్ నిర్మిస్తున్నారు. రవితేజ పుట్టినరోజును సందర్భంగా, మేకర్స్ ఆదివారం ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్ట ర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘ఇరుముడి’ అనే టైటిల్ పెట్టారు. ఫస్ట్ లుక్లో రవితేజ సాంప్రదాయ అయ్య ప్ప మాల దుస్తులు ధ రించిన శక్తిమంతమైన ఆధ్యాత్మిక అవతార్ లో కనిపించారు. ఇం దులో తండ్రీకూతుళ్ల మధ్య బలమైన బం ధం ఉంది, రవితేజ మునుపెన్నడూ చేయని ఒక విభిన్నమైన పాత్ర చేస్తున్నారు.

ఈ సినిమా కోసం కంప్లీట్ గా మేకోవర్ అవుతున్నారు.ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తె పాత్రను పోషిస్తోంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేశ్ ఇందిర, స్వాసిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ, సాహి సురేశ్ ప్రొడక్షన్ డిజైన్, ప్రవీణ్ పూడి ఎడిటర్. షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.