ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ
- బాధిత ఎమ్మెల్యేలపైనే కేసులా?
- మాజీమంత్రి హరీశ్ మండిపాటు
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) గొంతు పిసికి, సునితా లక్ష్మారెడ్డి(Sunita Lakshmareddy) చీర లాగి యావ త్ మహిళాలోకాన్ని అవమానించారని మాజీమంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) మండిపడ్డారు. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని విమర్శించారు. రేవంత్‌రెడ్డి(Revanth Reddy) కలియుగ దుశ్శాసనుడని, మహాభారతం(Mahabharata)లో కౌరవులకు పట్టిన గతే, నేడు కాంగ్రెస్ పార్టీకి పడుతుందన్నారు. మహిళా శాసనసభ్యుల(Women legislators) మీద జరిగిన దాడిని పోలీసులు పరిశీలిస్తారని మంత్రి శ్రీధర్‌బాబు(Sridhar Babu) చెప్పడం విడ్డూరంగా ఉందని, తన సొంత అక్కాచెల్లెళ్ల మీద ఇలాంటి దాడి జరిగితే అ లాగే అంటారా? అని ప్రశ్నించారు.
జరిగిన సంఘటన పట్ల మహిళా సభ్యులు కన్నీరు పెట్టుకున్నా ఇప్పటివరకు ఎలాంటి విచారణ చేపట్టకపోవడం విచారకరమన్నారు. సీపీకి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే న్యాయం చేయాల్సింది పోయి, దాడికి గురైన సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మీ మీదే రివర్స్ కేసులు పెట్టారని, ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లుగా తయారైందని పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఇది కేవలం బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి కాదు, రాష్ట్రంలోని యావత్ మహి ళా లోకంపై జరిగిన దాడి అని ఆవేదన వ్య క్తం చేశారు.
స్పీకరే మమ్మల్ని కాపాడాలి.. మా రెస్క్యూకి రావాలని విజ్ఞప్తి చేశారు. స్పీక ర్ అంటే మాకు ఎంతో గౌరవం ఉందని, సోమవారం జరిగిన ఘటనలో మా గౌరవ సభ్యుడు తాతా మధు ఆ మాటలను స్పీకర్‌ను ఉద్దేశించి అనలేదని స్పష్టం చేశారని తెలిపారు. ఒకవేళ అలా భావించి ఉంటే ఆ పదాలను ఉపసంహరించుకుంటున్నానని, విచారం వ్యక్తం చేస్తున్నానని లిఖితపూర్వకం గా, మీడియా ముఖంగా క్షమాపణలు కూ డా చెప్పారని పేర్కొన్నారు. స్పీకర్ నొచ్చుకుని ఉంటే పార్టీ తరఫున మేం కూడా విచా రం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు.
సభ్యుడు సారీ చెప్పినా, విచారం వ్యక్తంచేసినా.. కక్షపూరితంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని, ఒక తప్పుకు ఎన్ని శిక్షలు వేస్తారో వేయండి, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని స్పష్టం చేశా రు. ఈ ప్రభుత్వానికి దళిత, గిరిజనుల మీద నిజంగా ప్రేమే ఉంటే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. జాతి గర్వపడేలా నిర్మించిన 125 అ డుగుల అంబేద్కర్ విగ్రహానికి తాళాలు ఎం దుకు వేశారని నిలదీశారు. రేవంత్ రెడ్డికి దళితుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.