calender_icon.png 2 January, 2026 | 10:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో తీసిన గ్రేటెస్ట్ లవ్‌స్టోరీ ఇది

01-01-2026 12:00:00 AM

ఫాంటసీ విజువల్ వండర్ చిత్రంగా రూపుదిద్దుకున్న ‘గత వైభవం’ గత నెలలో కర్ణాటక వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను దక్కించుకుంది. ఎస్‌ఎస్ దుష్యంత్, ఆషిక రంగనాథ్ నటించిన ఈ చిత్రానికి సునీ దర్శకత్వం వహించారు. సర్వేగర సిల్వర్ స్క్రీన్స్, సునీ సినిమాస్ బ్యానర్లపై దీపక్ తిమ్మప్ప నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో కే నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా జనవరి 1న రిలీజ్ చేయనున్నారు.

ఈ సంద ర్భంగా మేకర్స్ బుధవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. కథా నాయకుడు దుష్యంత్ మాట్లాడుతూ.. ‘ఫస్ట్ హాఫ్ ఫన్ రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుంది. సెకండాఫ్ అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్స్ వేశాం. ఊహిం చిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. ఇది కన్నడలో తీసిన సినిమానే అయినా చూసే ప్రేక్షకులకు మాత్ర తెలుగు సినిమాలాగానే అనిపిస్తుంద’ని చెప్పారు.

కథానాయకి ఆషికా మాట్లాడుతూ.. “వరంగల్, హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీమియర్స్ వేస్తే, అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది” అని తెలిపింది. టాలీవుడ్ నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. “సినిమా చాలా అద్భుతంగా ఉంది. చాలా ఎమోషనల్ అయ్యాను. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో తీసిన గ్రేటెస్ట్ లవ్‌స్టోరీ ఇది. కచ్చితంగా ఈ సినిమాకు మంచి స్పందన వస్తుందనే నమ్మకం ఉంది. చాలా మంచి సెంటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు” అన్నారు.