01-01-2026 12:00:00 AM
యంగ్ హీరో శ్రీనందు నటిస్తున్న చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. ఈ చిత్రానికి వరుణ్‌రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీనందు, శ్యామ్‌సుందర్‌రెడ్డి తుడి నిర్మించారు. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించింది. జనవరి 1న విడుదల కానున్న ఈ సినిమా విశేషాలను హీరో శ్రీనందు విలేకరులతో పంచుకున్నారు. “-డిఫరెంట్ స్క్రీన్‌ప్లే, ఒక న్యూ ఏజ్ ఫిలిం మేకింగ్‌తో వస్తున్న సినిమా ఇది. ఈ కథలో చాలా మూస పద్ధతుల్ని బ్రేక్ చేశాం.
నిజంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఒక వీడియో గేమ్ చూసినట్టుంటుంది. జెన్‌జీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఫస్టాఫ్ అర్థమైన వాళ్లు జీవితాంతం దానిగురించే మాట్లాడుతూ ఉంటారు. సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది. నాకు డబ్బు కంటే గౌరవం చాలా ముఖ్యం. 18 ఏళ్లుగా ఎన్నో సినిమాలు చేశాను. బాగా నటించానని ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలో సోలో హీరోగా చేస్తున్నా. హీరోగా కూడా నిలదొక్కుకోగలుగుతానన్న ప్రశంస వస్తే మళ్లీ ఒక కొత్త ఊపిరి అందుతుంది.
మరో 10 ఏళ్లు పరిగెట్టడానికి ఉత్సాహం దొరుకుతుంది. 2025 చాలా బాగుంది.. 2026 కూడా అద్భుతమైన ఓపెనింగ్ అవుతుందని భావిస్తున్నా. -నాకు న్యూ ఇయర్ ప్లానింగ్ అంటూ పెద్దగా ఏమీ ఉండవు. -మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తా. -నేను, వెన్నెల కిషోర్, వైవా హర్ష కలిసి ఒక సినిమా చేస్తున్నాం. అనిల్ రావుపూడి దగ్గర రైటర్‌గా పనిచేసిన ప్రవీణ్ ఈ సినిమాకు దర్శకుడు. 17 జనవరి నుంచి ఈ సినిమా ప్రారంభం కాబోతోంది” అని చెప్పారు.